చిత్రం: సోనియా సమాధికి కౌంటర్‌గా బాబుకి అంత్యక్రియ

సోనియా చిత్రానికి సమాధిని సమైక్యవాదులు కట్టలేదని, టిడిపి నేతలే కట్టారని కాంగ్రెసు శ్రేణులు ఆరోపించారు. తమ పార్టీ నాయకురాలిని అవమానించడం తాము జీర్ణించుకోలేక పోయామన్నారు.
అందుకు నిరసనగా ఇష్టంలేకపోయినప్పటికీ బాబు దిష్టి బొమ్మకు అంత్యక్రియలు నిర్వహించి, దగ్ధం చేసినట్లు చెప్పారు. మరోచోట బాబును మహిషాసుర మర్ధని వధిస్తున్నట్లుగా చిత్రీకరించారు.
ఇళ్ల ముట్టడి
సమైక్య ఉద్యమం సీమాంధ్ర జిల్లాల్లో కొనసాగుతోంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కేంద్రమంత్రి పనబాక లక్ష్మి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడుకు సమైక్య సెగ తగిలింది. గుంటూరు జిల్లాలో ఎంపి, టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు ఇంటిని సమైక్యవాదులు ముట్టడించారు.












Click it and Unblock the Notifications