లష్కర్ నుంచి జయసుధ: మహేశ్వరం నుంచి సబిత

న్యూఢిల్లీ: తెలంగాణలో 42 శానససభా స్థానాలకు కాంగ్రెసు అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేసింది. తొలి జాబితాను రేపు శుక్రవారం విడుదల చేసే అవకాశం ఉంది. సిట్టింగ్‌లకు బెర్త్‌లు ఖరారు చేస్తూ, గత ఎన్నికల్లో ఓడిపోయినవారికి కూడా తిరిగి టికెట్లు ఇస్తూ ఈ జాబితా సిద్ధమైంది. ఏ విధమైన ఇబ్బంది లేని స్థానాలకు అభ్యర్థులు ఖరారైనట్లు తెలుస్తోంది.

రాజకీయాల పట్ల వైరాగ్యం ప్రదర్శిస్తూ వస్తున్న శాసనసభ్యురాలు జయసుధ తిరిగి సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ఇరుక్కున్న మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డికి మహేశ్వరం టికెట్ దక్కింది. పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ నిజామాబాద్ రూరల్ నుచి పోటీ చేయనున్నారు. మిగతా స్థానాలపై కసరత్తు కొనసాగుతోంది.

Congress candidates: Jayasudha from secunderabad

జాబితా ఇలా ఉంది...

1. నిజామాబాద్ రూరల్ - డి శ్రీనివాస్
2. ఆసిఫాబాద్ - ఆత్రం సక్కు
3. ఖానాపూర్ - బి రమేష్
4. బోధన్ - సుదర్శన్ రెడ్డి
5. బాల్కొండ - ఈ అనిల్
6. నిర్మల్ - మహేశ్వర్ రెడ్డి
7. జగిత్యాల - టి. జీవన్ రెడ్డి
8. చొప్పదండి - సుద్దాల దేవయ్య (గురువారంనాడే తెలుగుదేశం నుంచి కాంగ్రెసులో చేరారు)
9. మానుకోండూరు - ఆరేపల్లి మోహన్
10. నర్సాపూర్ - సునీతా లక్ష్మారెడ్డి
11. ఆర్మూర్ - కెఆర్ సురేష్ రెడ్డి
12. జహీరాబాద్ - జె. గీతారెడ్డి
13. సంగారెడ్డి - జగ్గారెడ్డి (రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ రెడ్డి విధేయుడిగా పేరు గడించారు)
14. దుబ్బాక - చెరుకు ముత్యం రెడ్డి
15. మేడ్చల్ - కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి
16. మహేశ్వరం - సబితా ఇంద్రారెడ్డి
17. మంథని - దుద్దిళ్ల శ్రీధర్ బాబు
18. పటాన్ చెరు - నందీశ్వర్ గౌడ్
19. గజ్వేల్ - నర్సారెడ్డి
20. కుత్బుల్లాపూర్ - కూన శ్రీశైలం గౌడ్
21. సనత్ నగర్ - మర్రి శశిధర్ రెడ్డి
22. జూబ్లీహిల్స్ - విష్ణువర్ధన్ రెడ్డి
23. ఖైరతాబాద్ - దానం నాగేందర్
24. వనపర్తి - చిన్నారెడ్డి
25. సికింద్రాబాద్ - జయసుధ
26. గోషామహల్ - ముఖేష్ గౌడ్
27. గద్వాల్ - డికె అరుణ
28. నల్లగొండ - కోమటిరెడ్డి వెంకటరెడ్డి
29. తుంగతుర్తి - అద్దంకి దయాకర్
30. జనగామ - పొన్నాల లక్ష్మయ్య
31. పినపాక - కాంతారావు రేగా
32. పాలేరు - ఆర్ వెంకటరెడ్డి
33. కొత్తగూడెం - వనమా వెంకటేశ్వరరావు
34. హుజూర్ నగర్ - ఉత్తమ్ కుమార్ రెడ్డి
35 జడ్చర్ల - మల్లు రవి
36. కల్వకుర్తి - చల్లా వంశీచంద్ రెడ్డి
37. మునుగోడు - స్రవంతిరెడ్డి
38. వరంగల్ తూర్పు - సారయ్య
39. భూపాలపల్లి - గండ్ర వెంకటరమణా రెడ్డి
40. భద్రాచలం - కుంజా సత్యవతి
41. మధిర - భట్టి విక్రమార్క
42. దేవరకొండ - బాలూ నాయక్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+