జగన్ గెలుపుపై హైకమాండ్ కు షర్మిల నివేదిక - ఫుల్ క్లారిటీ..!!
ఏపీలో అధికారం దక్కేదెవరికి. ఎన్నికల్లో హోరా హోరీగా పోరాటం చేసిన ప్రధాన పార్టీలు గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ పైన భారీ అంచనాలు ఉన్నాయి. జూన్ 4న ఎన్నికల పలితాలు వెల్లడి కానున్నాయి. జాతీయ స్థాయిలోనూ ఏపీ ఫలితాల పైన ఆసక్తి కనిపిస్తోంది. బీజేపీ తో టీడీపీ, జనసేన జత కట్టటంతో..జగన్ గెలిచే ఎంపీ సీట్ల పైన కాంగ్రెస్ ఆరా తీస్తోంది. పీసీసీ నుంచి నివేదిక కోరింది. ఏపీలో జగన్ గెలిచే సీట్ల పైన కాంగ్రెస్ నాయకత్వానికి పంపిన నివేదికలో కీలక అంశాలు ఉన్నట్లు సమాచారం.
ఏపీలో ఫలితాలు
ఏపీలో ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిగా మూడు పార్టీలు కలిసి పోటీ చేసాయి. కాంగ్రెస్ వామపక్షాల కూటమిగా బరిలో నిలిచాయి. వైసీపీ సింగిల్ గా పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఎన్డీఏ కూటమి - వైసీపీ మధ్య ప్రధానంగా పోటీ సాగినట్లు ఎన్నికల సరళి స్పస్టం చేస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓటింగ్ పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఏపీలో బీజేపీ తో టీడీపీ, జనసేన కలవటంతో..జాతీయ స్థాయిలోనూ ఏపీ ఫలితాల పైన ఆసక్తి కనిపిస్తోంది. ప్రధానంగా ఏపీలో ఎంపీ సీట్ల పైనే ఫోకస్ కనిపిస్తోంది.

జగన్ అంచనా వెనుక
ఏపీలో గెలుపు పైన జగన్ ధీమాతో ఉన్నారు. 2019 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసారు. 151 అసెంబ్లీ, 22 ఎంపీ సీట్ల కంటే ఎక్కువ గెలుస్తామని విశ్వాసంతో ఉన్నారు. అదే సమయంలో టీడీపీ నేతలు సైతం తమ గెలుపు పైన నమ్మకంతో కనిపిస్తున్నారు. రాష్ట్రంలోని 25 ఎంపీ సీట్లలో ఎవరు ఎక్కువ సీట్లు గెలుస్తారనే చర్చ మొదలైంది. జగన్ మెజార్టీ ఎంపీ సీట్లు గెలిచినా..బీజేపీకి మద్దతిచ్చే అవకాశం ఉండదని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉండటంతో..జగన్ స్వతంత్రంగానే ఉండే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.

పార్టీకి ఏపీ నేతల నివేదిక
ఇక..ఏపీలో ఎన్నికల ఫలితాల పై కాంగ్రెస్ ముఖ్యుల నుంచి హైకమాండ్ నివేదిక కోరింది. షర్మిల ద్వారా ఆ నివేదిక ఢిల్లీ చేరింది. వైఎస్సార్ హయాంలో కీలక పాత్ర పోషించిన పార్టీ సీనియర్ ఏపీ ఫలితాల పైన తన అంచనాలను పార్టీ ముఖ్యులకు నివేదించినట్లు సమాచారం. జగన్ వైపే సానుకూలత ఉందని నివేదించినట్లు విశ్వసనీయ సమాచారం. జగన్ కాంగ్రెస్ కు మద్దతిచ్చే అవకాశం కనిపించటం లేదని ఆ నేత ఢిల్లీ ముఖ్యులకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో కడపలో షర్మిల ప్రభావం పైనా ఆరా తీసారని చెబుతున్నారు. దీంతో..ఫలితాల్లో జగన్ గెలిచే ఎంపీ సీట్ల ఆధారంగా ఢిల్లీలో కీలక నిర్ణయాలు జరిగే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications