మేయర్ పదవి ట్విస్ట్: కాంగ్రెసుతోనే మజ్లిస్, తెరాసకు నో

హైదరాబాద్: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఒంటరిగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తుండగా... కాంగ్రెసు పార్టీ సిపిఐ, మజ్లిస్ పార్టీతో కలిసి బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాదు నగర మేయర్ మాజీద్ హుస్సేన్ రాజీనామాను కాంగ్రెసు, మజ్లిస్ కార్పోరేటర్లు తిరస్కరించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల పొత్తుల వ్యూహాంలో భాగంగానే మాజిద్ రాజీనామాకు ఒప్పుకోలేదని అంటున్నారు.

మజ్లిస్‌తో పొత్తుకోసం కాంగ్రెస్ మేయర్ పదవి ద్వారా మరో అడుగు ముందుకేసిందంటున్నారు. హైదరాబాద్ మేయర్ పదవిని మజ్లిస్‌కే వదిలి వేయాలని నిర్ణయించింది. తద్వారా కీలకమైన సార్వత్రిక ఎన్నికల్లో మైనారిటీ ఓటు బ్యాంకు దూరం కాకుండా పావులు కదిపింది. ఈ మొత్తం వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్ ఢిల్లీనుంచే పర్యవేక్షించారు. ఇరుపార్టీల మధ్య చర్చలు సఫలం కావడంతో మేయర్ పదవికి మాజిద్ హుస్సేన్ చేసిన రాజీనామా తిరస్కరణకు గురైంది.

Congress is likely to tie up with CPI and MIM in Telangana

విభజన నేపథ్యంలో తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మైనారిటీల మద్దతు తప్పనిసరన్న విషయాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం గుర్తించింది. ఈ నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్ మజ్లిస్ నాయకుడు అసదుద్దీన్ ఒవైసీతో ఫోన్‌లో మాట్లాడారు. ఆ తరువాత అధిష్ఠానం సూచనల మేరకు రంగంలోకి దిగిన బొత్స సత్యనారాయణ, దానం నాగేందర్.. అసదుద్దీన్‌తో ఫోన్లలోనే చర్చలు జరిపారు. మేయర్ పదవిలో మజ్లిస్ నేత కొనసాగేలా ఒప్పించి వచ్చే ఎన్నికల్లో పొత్తుల దారులు తెరిచారు.

వాస్తవానికి హైదరాబాద్ మేయర్ పదవిపై కాంగ్రెస్, మజ్లిస్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం మొదటి రెండేళ్లు కాంగ్రెస్‌కు, తర్వాత రెండేళ్లు మజ్లిస్ కు, మిగిలిన ఏడాది మళ్లీ కాంగ్రెస్ కు చెందినవారు మేయర్ పీఠాన్ని దక్కించుకుంటారు. అయితే మిగిలి ఉన్న ఏడాది పరిపాలనను కూడా మజ్లిస్‌కు వదిలి వేయాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది.

మరోవైపు ప్రస్తుత తరుణంలో ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకొని వచ్చే ఎన్నికల్లో తన బలం పెంచుకోవాలని మజ్లిస్ కూడా ఎదురు చూస్తోంది. తెరాసతో ముందుకు వెళదామంటే ఎన్నికల తర్వాత ఆ పార్టీ బిజెపితో చేతులు కలిపితే పరిస్థితి ఏమిటనే ప్రశ్న మజ్లిస్ నేతల్లో తలెత్తుతోంది. తమకు ఏదో ఒక జాతీయ పార్టీ అండ ఉంటేనే మంచిదనే అభిప్రాయం కూడా ఆ పార్టీనేతల్లో వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే మేయర్ పదవిపై కాంగ్రెస్ ప్రతిపాదనను మజ్లిస్ నేతలు అంగీకరించారని తెలిసింది. ఇక సిపిఐ కూడా కాంగ్రెసు పార్టీతో కలిసి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+