"వెంకయ్యకు చంద్రబాబులో నచ్చిందేంటో.. అంతలా ప్రశంసించడానికి!"
విజయవాడ : అమరావతి నిర్మాణంలో భాగంగా.. శుక్రవారం నాడు శాశ్వత భవనాల నిర్మాణానికి ఏపీ సర్కార్ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సహా కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, కార్యక్రమంలో ప్రసంగించిన వెంకయ్య సీఎం చంద్రబాబుపై పలు ప్రశంసలు కురించారు.
ఇప్పుడిదే విషయాన్ని లేవనెత్తుతూ.. పొగడ్తలతో ముంచెత్తేంతా మంచిపని చంద్రబాబు ఏంచేశారని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య. వెంకయ్యకు చంద్రబాబులో అంతగా ఏం నచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు నష్టం చేకూర్చే విధానాలా? ఓటుకు నోటు కేసులో దొరికిపోవడమా? పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడమా? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమా?.. వీటిల్లో వెంకయ్యను అంతలా ఆకట్టుకున్నదేమిటో చెప్పాలన్నారు.

మొత్తంగా వెంకయ్య పొగడ్తలను తీవ్రంగా తప్పుబట్టిన రామచంద్రయ్య.. రాష్ట్రాన్ని నిలువునా దోపిడీ చేస్తున్నందేకేనా? చంద్రబాబును అభినందించింది అంటూ నిలదీశారు. కేవలం అరుణ్ జైట్లీని అభినందించాలన్న ఒకే ఒక్క ఉద్దేశ్యంతో శుక్రవారం నాడు శంకుస్థాపన సభ నిర్వహించారని మండిపడ్డారు. పోలవరం నిర్మాణ బాధ్యత కేంద్ర పరిధిలో ఉన్న అంశం అయినప్పటికీ కేవలం కమిషన్లకు కక్కుర్తి పడి పోలవరం ప్రాజెక్టు బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకునేలా చంద్రబాబు వ్యవహరించారని దుయ్యబట్టారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications