ఉండవల్లిపై కాంగ్రెసు వేటు: ఎమ్మెల్యే రౌతు రాజీనామా

తన రాజీనామా లేఖను పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ఫాక్స్ చేసినట్లు రౌతు సూర్యప్రకాష్ రావు తెలిపారు. ఉండవల్లి అరుణ్ కుమార్ నిజాయితీ గల నాయకుడని, ప్రజల సంక్షేమం కోసం పనిచేశారని, ఉండవల్లిపై బహిష్కరణకు నిరసనగా తాను రాజీనామా చేశానని ఆయన వివరించారు.
తాను పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కలుస్తానని ఆయన చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి శాసనసభా నియోజకవర్గం నుంచి రౌతు సూర్యప్రకాష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు.
కాగా, పార్లమెంటు సభ్యుల బహిష్కరణపై సీమాంధ్ర కాంగ్రెసు నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రాయలసీమకు చెందిన మంత్రి శైలజానాథ్, ఉత్తరాంధ్రకు చెందిన మంత్రి గంటా శ్రీనివాస రావు పార్లమెంటు సభ్యుల బహిష్కరణపై నిరసన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications