కెసిఆర్‌తో మజ్లీస్: మేయర్‌పై కాంగ్రెసు అవిశ్వాసం?
హైదరాబాద్: మజ్లీస్ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి దగ్గరవుతున్న నేపథ్యంలో కాంగ్రెసు హైదరాబాద్ నగర మహా పాలక సంస్థ మేయర్‌ను దించేయాలనే ఉద్దేశంతో ఉంది. శాసన మండలి చైర్మన్ ఎన్నిక హైదరాబాద్ మేయర్‌కు గండంగా మారింది. ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్‌తో అవగాహనవంతమైన పొత్తును కొనసాగించిన మజ్లిస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, తెరాస ప్రభుత్వ ఏర్పాటు అనంతరం ఆ పార్టీతో జతకట్టడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా పరిగణిస్తోంది.
దీంతో జిహెచ్‌ఎంసిలో తమ మద్దతుతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న మజ్లిస్ పార్టీపై అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు తెరాసలో చేరటం, అలాగే తెలంగాణ శాసన మండలి అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించి మజ్లిస్ ఎమ్మెల్సీలు కూడా తెరాస అభ్యర్థికి మద్దతు పలకటంతో కాంగ్రెస్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పదవీకాలం ముగిసేందుకు ఇంకా ఆర్నెళ్లు మాత్రమే గడువు ఉంది. దీంతో ఇప్పట్లో అవిశ్వాస తీర్మానం పెట్టొచ్చా? లేదా? అన్న విషయంపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఒక వేళ అవిశ్వాస తీర్మానం సాధ్యపడితే మజ్లిస్ మేయర్‌కు గట్టెక్కడం కొంత కష్టతరంగా మారనుంది.
మొత్తం 150 మంది కార్పొరేటర్లున్న పాలక మండలిలో కాంగ్రెస్ సంఖ్యాబలమే ఎక్కువగా ఉంది. శాసన మండలిలో తాము మద్దతు చేసిన విధంగా మజ్లిస్‌కు తెరాస మద్దతిచ్చేందుకు ఆ పార్టీకి ఒక్క కార్పొరేటర్ కూడా లేకపోవటంతో మజ్లిస్ తెలుగుదేశం పార్టీ మద్దతు తీసుకుంటే గానీ గట్టెక్కని పరిస్థితి ఉంది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి కూడా సంఖ్యాబలం తక్కువగానే ఉన్నా, ఆ తర్వాత ఎన్నికల ఫలితాలు, రాజకీయ సమీకరణ నేపథ్యంలో గతంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన కొందరు కార్పొరేటర్లు సొంత గూటికి తిరిగివచ్చేనట్టే వ్యవహారిస్తుండటంతో కాంగ్రెస్‌కున్న సంఖ్యాబలం సుమారు 50 వరకుటుంది. మజ్లిస్‌కు మాత్రం కేవలం 40 మంది సభ్యులు మాత్రమే ఉండటంతో అవిశ్వాస తీర్మానం పెడితే మజ్లిస్ మేయర్‌కు గండం తప్పేలా లేదు.
ప్రస్తుతం జిహెచ్‌ఎంసిలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మజ్లిస్, తెలుగుదేశం పార్టీల మధ్య కాస్త సాన్నిహిత్యం ఉన్నా, అవిశ్వాస తీర్మానంలో ఆ పార్టీ కార్పొరేటర్ల మజ్లిస్‌కు మద్దతివ్వాలా? లేదా? అన్న విషయంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబుదే తుది నిర్ణయం కానుంది. ఈ క్రమంలో మజ్లిస్ పార్టీ కూడా కేవలం ఆర్నెళ్ల మేయర్ పదవీ కాలం కోసం తెరాస కాకుండా ఇతర పార్టీల మద్దతును కోరుకోవద్దనే భావిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications