కాంగ్రెస్ వారి ఉద్యోగాలు: చిరు సహా వీరి తిరుగు బాట!
హైదరాబాద్: సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. సీమాంధ్ర నుండి ఒక్కరంటే ఒక్కరు కూడా కాంగ్రెసు పార్టీ నుండి ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా గెలుపొందలేదు.
కాంగ్రెసు పార్టీ ఓటమి నేపథ్యంలో పలువురు నేతలు ఇప్పుడు తమ పాత వృత్తుల వైపు దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా చిరంజీవి ముఖానికి రంగు వేసుకోనున్నారు. చిరంజీవి 150వ చిత్రం కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.
ఢిల్లీలో, రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ వైఫల్యం నేపథ్యంలో చిరంజీవి తన 150వ చిత్రం పైన దృష్టి సారించనున్నారు. అదే విధంగా గతంలో వైద్యులుగా, న్యాయవాదులుగా ఉన్న కాంగ్రెసు నేతలు తిరిగి తమతమ వృత్తుల పైన దృష్టి సారించారు.

చిరంజీవి
చిరంజీవి ముఖానికి రంగు వేసుకోనున్నారు. చిరంజీవి 150వ చిత్రం కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.

కిల్లి కృపారాణి
మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి, ఆమె భర్త కిల్లి రామ్మోహన్ రావు వృత్తిరీత్యా వైద్యులు. వారికి శ్రీకాకుళంలో ఓ నర్సింగ్ హోం ఉంది. వారు తిరిగి తమ ఆసుపత్రిలో వైద్యులుగా మారనున్నారట. మాజీ మంత్రి శైలజానాథ్, ఆయన సతీమణి... ఇద్దరు కూడా మెడికల్ ప్రాక్టీస్ వైపు దృష్టి సారించనున్నారట.

కొండ్రు మురళీ
మాజీ మంత్రి కొండ్రు ముళీ మోహన్ తన విద్యా సంస్థలను నడపనున్నారు. ఆయన తన పూర్తి దృష్టిని తన సొంత విద్యా సంస్థల పైనే పెట్టనున్నారట.

రఘువీరా రెడ్డి
మాజీ మంత్రి, ఎపిసిసి అధ్యక్షులు రఘవీరా రెడ్డి ఓ వైపు కాంగ్రెసు పార్టీ కార్యకలాపాలు చూస్తూనే వ్యవసాయం చూసుకోనున్నారు. ఇక నుండి అతను తన పొలాల వెంట నడవనున్నారు. ఇటీవల నామినేషన్ సందర్భంగా ఆయన ఎడ్ల బండి పైన వచ్చి నామినేషన్ వేసిన విషయం తెలిసిందే.

డొక్కా మాణిక్యవర ప్రసాద్
మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ న్యాయవాది. ఆయన సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్‌లో తన పేరును నమోదు చేసుకోవాలని భావిస్తున్నారట. రాజకీయాల పైన కూడా దృష్టి సారించనున్నారు. మరో సీనియర్ నేత గిడుగు రుద్రరాజు ఇప్పటికే సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్‌లో తన పేరును నమోదు చేసుకున్నారు. ఇతను కూడా రాజకీయాల పైన దృష్టి సారించనున్నారు.

ఆనం సోదరులు
ఆనం సోదరులు (ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం వివేకానంద రెడ్డిలు రాజకీయాల నుండి తప్పుకునే అవకాశముంది. వారి కుటుంబ సభ్యులు ఇప్పటికే రాజకీయాల్లోకి వచ్చారు.
-
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ సంచలన నిర్ణయాలు ఇవే.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!!












Click it and Unblock the Notifications