ముఖ్యమంత్రి పదవి ఆఫర్: వద్దే వద్దన్న మంత్రి కోట్ల
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మార్చి ఆ స్థానంలో కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డిని కూర్చోబెట్టాలన్న కాంగ్రెసు అధిష్టానం వ్యూహం బెడిసికొట్టింది. కోట్లను ప్రత్యేకంగా ఢిల్లీకి పిలిపించిన అధిష్ఠానం ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని అడిగింది.
ఇందుకు శనివారం రాత్రి ప్రత్యేక విందు కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఈ వ్యూహం అంతా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ నేతృత్వాన అమలు కావలసి ఉంది. అయితే కోట్ల ముఖ్యమంత్రి పదవిని సున్నితంగా తిరస్కరించడంతో కాంగ్రెస్ అధిష్ఠానం వ్యూహానికి గండి పడింది. ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితులలో ముఖ్యమంత్రి పదవిని అంగీకరించలేనని కోట్ల స్పష్టం చేసినట్టు తెలిసింది.

రాష్ట్ర విభజనకు ఒప్పుకోని కిరణ్‌ను మార్చి విభజన ప్రక్రియను ముందుకు తీసుకువెళ్ళాలన్న కాంగ్రెస్ వ్యూహానికి గట్టి దెబ్బే తగిలిందని భావించవచ్చు. ముఖ్యమంత్రిని మార్చిన అనంతరం తలెత్తే పరిణామాల గురించి కలత చెందనక్కరలేదని, అంతా తాము చూసుకుంటామని అధిష్ఠానం నచ్చజెప్పినా కోట్ల మాత్రం సుతరామూ అంగీకరించలేదని తెలుస్తున్నది.
అసలే సీమాంధ్రలో ప్రజలు సమైక్యాంధ్ర గళం వినిపిస్తున్న సమయంలో తాను ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోవడానికి కోట్ల విముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితిలో ఎవరూ ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోరని రాష్ట్ర మంత్రి టిజి వెంకటేష్ అన్న విషయం తెలిసిందే.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications