ఒక్క టిక్కెట్.. 2 ఎన్నికలు: సీమాంధ్రలో కాంగ్రెస్ ఆఫర్!

కాంగ్రెసు పార్టీకి సరైన అభ్యర్థులు దొరకని పరిస్థితి సీమాంధ్రలో కనిపిస్తోంది. సీనియర్లు చాలామంది ఇతర పార్టీల్లోకి వెళ్లినందున.. కొత్త వారి కోసం కాంగ్రెసు వెతుకుతోంది. అయితే, కొత్తగా పోటీ చేద్దామనుకునే ద్వితీయశ్రేణి నాయకుల్లో అనుమానాలు ఉన్నాయట. ఇప్పుడు తాము పోటీ చేస్తున్నప్పటికీ పార్టీ క్రమంగా బలం పుంజుకుంటే... పాతవారు తిరిగి పార్టీలోకి వస్తే తమను పక్కన పెట్టే అవకాశముందని అనుమానిస్తున్నారట. దీంతో ఈ ఎన్నికల్లో పోటీ చేసే వారికే 2019 ఎన్నికల్లోను సీట్లు ఇస్తామని కాంగ్రెసు హామీ ఇస్తోందట.
సీమాంధ్రలో కాంగ్రెస్‌కు కాయకల్ప చికిత్స చేసేందుకు ఆ ప్రాంత ముఖ్య నాయకులు నడుం బిగించిన విషయం తెలిసిందే. వలసల నివారణకు, పార్టీ శ్రేణులకు ధైర్యం కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి సోమవారం ఆంధ్ర (సీమాంధ్ర) ప్రాంత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్ రఘువీరా రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి చిరంజీవి, పిసిసి మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు ఆనం రాంనారాయణ రెడ్డి, వట్టి వసంత్ కుమార్ ప్రభృతులు పాల్గొన్నారు.
రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో పార్టీకి జరిగిన నష్ట నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి వారు ప్రధానంగా చర్చించారు. ఇందులో భాగంగానే తొలుత సీమాంధ్రలో బస్సు యాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 21వ తేదీ నుంచి బస్సు యాత్రను శ్రీకాకుళం నుంచి ప్రారంభించాలని వారు సూత్రప్రాయంగా నిర్ణయించారు. యాత్రను ప్రతి రోజూ రెండు జిల్లాల్లో నిర్వహిస్తూ అనంతపురంలో ముగించాలని వారు భావించారు.
బస్సు యాత్ర నిర్వహించడం ద్వారా పార్టీ శ్రేణులకు మనోధైర్యం కల్పించాలని, పార్టీ నుంచి ముఖ్య నాయకులు ఎవరూ ఇతర పార్టీల్లోకి వలస వెళ్ళకుండా నిరోధించడానికి ఉపయోగపడుతుందని వారు భావించినట్లు సమాచారం. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీనే దోషిగా నిలబెడుతూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని వారు నిర్ణయించారు. రాష్ట్ర విభజనకు తమకు అభ్యంతరం లేదని ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ లేఖ ఇచ్చిందని, రాజ్యాంగంలోని ఆర్టికల్-3 ప్రకారం విభజన చేయవచ్చని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేకసార్లు బహిరంగంగా ప్రకటించిందని ప్రజలకు తెలియజేయాలని వారు భావించారు.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!!












Click it and Unblock the Notifications