నంద్యాల బరిలో కాంగ్రెస్, కోట్లతో చర్చలు: కౌన్సిలర్ల ఇళ్లలో సోదాలు
నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపికకు కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి కుటుంబంతో చర్చిస్తున్నామని ఏపీ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు తులసి రెడ్డి తెలిపారు.
నంద్యాల: నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపికకు కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి కుటుంబంతో చర్చిస్తున్నామని ఏపీ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు తులసి రెడ్డి తెలిపారు.
నంద్యాలలో శనివారం ఆయన కాంగ్రెస్ కార్యకర్తలతో అభ్యర్థి ఎంపిక ప్రకటనపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. నంద్యాల నుంచి పోటీ చేయాలని కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి కుటుంబం నుంచి ఆహ్వానిస్తున్నామని తెలిపారు.

వారి నుంచి సుముకత కోసం వేచి చూస్తున్నామన్నారు. వారి నుంచి సమాధానం వస్తే రెండు రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారు. మరికొందరి పేర్లు పరిశీలిస్తున్నామన్నారు.
నంద్యాలలో కౌన్సిలర్ల ఇళ్లలో సోదాలు
నంద్యాల నియోజకవర్గం నోటిఫికేషన్ రెండు రోజుల క్రితం విడుదలయింది. ఈ నేపథ్యంలో నంద్యాల పట్టణంలో కౌన్సెలర్‌ల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications