టిపై కాంగ్రెస్ వెనక్కి వెళ్లదు, ఐనా: లగడపాటి సంచలనం
న్యూఢిల్లీ: విభజనపై కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మంగళవారం న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. విభజనపై కాంగ్రెసు పార్టీ వెనక్కి వెళ్లదని అయినా, విభజన సాధ్యం కాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇంతవరకు ఏ రాష్ట్రం ఇంత అసమ్మతితో ఏర్పడలేదని చెప్పారు. కాంగ్రెసు పార్టీ విభజనపై వెనక్కి వెళ్లకపోయినా రాష్ట్రం సమైక్యంగా ఉంటుందనే నమ్మకం తమకు ఉందన్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేయడం సరికాదన్నారు.

కావూరి నివాసంలో సీమాంధ్ర నేతల భేటీ
కేంద్ర జౌళీ శాఖ మంత్రి కావూరి సాంబశివ రావు నివాసంలో మంగళవారం మధ్యాహ్నం సీమాంధ్ర కేంద్రమంత్రులు సమావేశమయ్యారు. రాయల తెలంగాణ అంశంపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది.
బాధ్యత టి నేతలదే: కోదండ
హైదరాబాదు రాజధానిగా పది జిల్లాల తెలంగాణ బాధ్యత తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలదేనని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ అన్నారు. కోదండ నేతృత్వంలో జెఏసి నాయకులు సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డిని కలిశారు. పది జిల్లాల తెలంగాణ మద్దతివ్వాలని కోరారు. తాము దానికే కట్టుబడి ఉన్నామని సురవరం వారికి చెప్పారు.
గీతారెడ్డి ఇంట్లో టి నేతల భేటీ
మంత్రి గీతా రెడ్డి నివాసంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు భేటీ అయ్యారు. అకస్మాత్తుగా తెరపైకి వచ్చిన రాయల తెలంగాణ అంశంపై వారు చర్చిస్తున్నారు.
రాజధానిపై రాయపాటి
విభజన అనివార్యమైతే గుంటూరు - విజయవాడల మధ్య రాజదానిని ఏర్పాటు చేయాలని గుంటూరు ఎంపి రాయపాటి సాంబశివ రావు అన్నారు. తాను ముఖ్యమంత్రిని కలిసి మంగళగిరిలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కోరినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications