పేరెంట్స్ కు అలర్ట్, పిల్లల్లో కళ్లకలక - స్కూళ్లల్లో వ్యాప్తి, సూచనలు ఇవే..!!
కళ్లకలక సమస్య ఇప్పుడు కలవరపెడుతోంది. ప్రధానంగా పలు ప్రాంతాల్లో పాఠశాలల విద్యార్ధుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. వర్షాకాలం ఆరంభంలో కనిపించే ఈ వైర్ సమస్య గతంలో ఎన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో ప్రస్తుతం ఉంది. పాఠశాలల్లోనే ఈ సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు యాజామాన్యాలు చెబుతున్నాయి. దీంతో విద్యార్ధులు ప్రధానంగా ఇబ్బంది పడుతున్నారు. దీంతో, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
కళ్లకలకల కలవరం : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోని పాఠశాలల్లో కళ్లకలక ఉన్న వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. ఒక విద్యార్ధికి ఇది సోకిన విషయం గుర్తించే లోపు ఇతర విద్యార్దులకు వ్యాపిస్తోంది. యాజమన్యాలు..ఉపాధ్యాయులు కళ్లకలక ఉన్న విద్యార్ధును గుర్తిస్తే వెంటనే పేరెంట్స్ కు సమాచారం ఇచ్చి ఇళ్లకు పంపుతున్నారు. ఈ సీజన్ లో ఇంటి వద్దే పిల్లల కంటి అంశాలను పరిశీలించాలని పాఠశాలలు కోరుతున్నాయి.

కండ్లకలక సులువుగా ఒకరినుంచి మరొకరికి వ్యాపిస్తుంది. కాబట్టి.. కండ్లకలక ఉన్నవారు ఒంటరిగా జాగ్రత్తలు అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. కండ్లకలక సాధారణంగా రెండు రోజుల్లో తగ్గిపోతుంది కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.
ఇన్ఫెక్షన్ కారణంగా వ్యాప్తి : కండ్లకలకను, పింక్ ఐ అని కూడా పిలుస్తారు. ఇది కంటిలోని పొర (కంజక్టివా)కు ఇన్ఫెక్షన్ సోకి, దాని ఫలితంగా కలిగిన వాపు. కంజక్టివా అనేది కనురెప్పను, కళ్ళలోని తెల్లని భాగాన్ని కప్పి ఉంచే పారదర్శక పొర. కళ్ళ కలకలు ఇన్ఫెక్షన్ కారణంగా పారదర్శక పొర ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారడానికి కారణమవుతాయి, అందుకే దీనికి పింక్ ఐ అని పేరు వచ్చింది.
కండ్ల కలక మన దృష్టిని ప్రభావితం చేయదు, కానీ కొన్నిసార్లు రేపుదలను కలిగిస్తాయి. ఇది ఒక అంటు వ్యాధి కాబట్టి కండ్లకలకకు అది ప్రారంభ దశలో ఉన్నప్పుడే చికిత్స అవసరం. ఇది సాధారణంగా బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్ ఫలితంగా కలుగుతుందనివైద్యులు వివరిస్తున్నారు.

జాగ్రత్తలు అవసరం : సీజనల్ గా వచ్చే కండ్ల కలకలు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యుల సూచనలు చేస్తున్నారు. కంట్లో దురద, నిద్ర లేచిన తరువాత కళ్లు తెరవలేకపోవటం, ఉబ్బిన కళ్లు, కంటిలో నీరు కారటం వంటివి కళ్లకలక లక్షణాలుగా పేర్కొంటున్నారు. కళ్లను చేతులతో తాకకూడదు. చేతులలోని బ్యాక్టిరీయా ఈ సమస్యను మరింత పెంచే అవకాశముంది.
కళ్లను నీళ్లు చిమ్మరిస్తూ.. శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎక్కువ నీరు తాగితూ.. హైడ్రేటెడ్‌గా ఉండాలి. కాంటాక్ట్ లెన్సులు వాడటం మానేయాలి. బయటకు వెళ్లాల్సి వస్తే.. కళ్లకు షేడ్స్ పెట్టుకుని వెళ్లాలని సూచనగా చెప్పుకొచ్చారు. ఇది ఒక అంటు వ్యాధి కాబట్టి కండ్లకలకకు అది ప్రారంభ దశలో ఉన్నప్పుడే చికిత్స అవసరమని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications