పెళ్లి చేసుకుంటానని అమ్మాయిపై కానిస్టేబుల్ రేప్

తమ పక్కనే ఉండే ఎపిఎస్‌పి హెడ్ కానిస్టేబుల్ 17 ఏళ్ల వయస్సుగల కూతురితో ఏడాదిన్నర పాటు సతీష్ రామ్ సంబంధం పెట్టుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ అమ్మాయిని అతను ముగ్గులోకి దించాడు. బాధితురాలికి తెలియకుండా అతను మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.
అతనికి నెల రోజుల క్రితం ఓ కుమారుడు కూడా పుట్టాడు. సతీష్ పెళ్లి గురించి అమ్మాయికి ఇటీవలే తెలిసింది. దీంతో ఆమె తీవ్ర మానసిక ఆందోళనకు గురైంది. రాత్రి పూట పడకగదిలోకి వెళ్లి లోపలి నుంచి గడియ పెట్టి ఆత్మహత్య చేసుకుంది.
బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సతీష్ రామ్‌ను పోలీసులు ఆదివారంనాడు అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్‌కు పంపించారు.












Click it and Unblock the Notifications