వివాహితతో అక్రమ సంబంధం: కానిస్టేబుల్‌ను చితకబాదిన స్థానికులు
విజయవాడ: నెల్లూరు జిల్లాలోని తోటపల్లిగూడూరులో వివాహేతర సంబంధం పెట్టుకున్న కానిస్టేబుల్‌ను స్థానికులు చితకబాదారు. గత రాత్రి ఓ మహిళతో ఉండగా రెడ్‌హ్యాడెండ్‌గా పట్టుకుని ఇరువురికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
అయితే, ఆ మహిళను తాను పెళ్లి చేసుకుంటానని కానిస్టేబుల్ చెబుతున్నాడు. అయితే తన భర్తే తనను కావాలని ఇరికించారని మహిళ ఆరోపించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

మార్టూరులో భారీ దొంగతనం
అదలావుంటే, ప్రకాశం జిల్లా మార్టూరులో ఆదివారం అర్థరాత్రి దొంగలు రెచ్చిపోయారు. పకడ్బందీగా స్కెచ్ వేసి దొంగతనానికి పాల్పడ్డారు. స్థానిక నాగరాజుపల్లి రోడ్డులోని కాకతీయ పాఠశాల పక్కన నివాసం ఉండే మువ్వ అంజయ్య ఇంట్లోకి ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత ఐదుగురు గుర్తు తెలియని దుండగులు చొరబడ్డారు
ముసుగులు వేసుకుని, లుంగీలను గోచీలుగా మలుచుకున్నారు. వస్తూనే పొరుగున ఉన్న ఇళ్ల తలుపులతో పాటు అంజయ్య ఇంటి పై అంతస్తులో ఉంటున్న అతని కుమారుడి గదికి కూడా బయటి నుంచి గొళ్లాలు వేసి, బైండింగ్ వైరుతో చుట్టారు.
ఆ తర్వాత అంజయ్య పోర్షన్‌లోనే ఉండే అతని మామ సత్యనారాయణ గదికి కూడా బయటి నుంచి గొళ్లెం పెట్టి బైండింగ్ వైరుతో చుట్టేశారు. ఆ తర్వాత అంజయ్య దంపతులను కత్తితో బెదిరించి, కాళ్లూ చేతులూ కట్టిపడేశారు. ఇంట్లో ఉన్న బీరువాను వరండాలోకి తీసుకొచ్చి అందులోని ఉన్న ఒక కిలో వెండి, 64 సవర్ల బంగారు నగలతో పాటు ఒక లక్ష నగదును ఎత్తుకు పోయారు.












Click it and Unblock the Notifications