తుపాకితో కాల్చుకుని పోలీసు కానిస్టేబుల్ ఆత్మహత్య

 Constable commits suicide
హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో ఓ పోలీసు కానిస్టేబుల్ తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నడాు. జిల్లాలోని కాశీపేట మండలం దేవాపూర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న లక్ష్మీసాగర్ గురువారం తెల్లవారు జామున ఆత్మహత్య చేసుకున్నాడు.

గత కొంత కాలంగా లక్ష్మీసాగర్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దానికితోడు పని ఒత్తిడి కూడా పెరగడంతో అనతు అత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఉన్మాది వీరంగం

ఇదిలా పుంటే, వరంగల్ జిల్లా పరకాల మండలం రాయపర్తిలో ఉన్మాది వీరంగం సృష్టించాడు. గొడ్డలి పట్టుకని తిరుగడం ప్రారంభించాడు. దీంతో స్థానికులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

కారు బీభత్సం

హైదరాబాద్‌లోని అమీర్‌పేట లాల్ బంగ్లా వద్ద రహదారిపై కారు బిభత్సం సృష్టించింది. మ్యాన్‌హోల్‌న ు తప్పించబోయి అదుపు తప్పిన కారు అటుగా వెళ్తున్న జూకంటి శ్రీహర్షను ఢీకొట్టింది. ఆ తర్వాత ట్రావెల్స్ మినీ బస్సును ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడిన శ్రీహర్షను పోలీసులు సోమాజిగుడాలోని యశోద ఆస్పత్రికి చికిత్స నిమిత్తం పంపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+