సామాన్యులకు త్వరలో వంటనూనెల షాక్!
సామాన్య మధ్య తరగతి ప్రజలకు నిజంగానే ఇది షాకింగ్ న్యూస్. దేశంలో వంట నూనె ధరలకు త్వరలోనే రెక్కలు రాబోతున్నాయి అనేది తాజాగా కేంద్ర ప్రభుత్వం చర్యతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎవరైనా వంట నూనెను కొనుగోలు చేయాలి అనుకుంటే ఇప్పుడే కొనుగోలు చేసుకుంటే మంచిది అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
దిగుమతి సుంకం పెంచిన కేంద్రం
త్వరలో మధ్యతరగతి కుటుంబీకుల పైన మరో భారం పడనుందని, గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న వంట నూనెల ధరను మళ్ళీ పెరగబోతున్నాయని తాజా పరిస్థితులతో అర్థమవుతుంది. ముడి చమురు, శుద్ధి చేసిన ఎడిబుల్ ఆయిల్ పైన కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని 20 శాతం పెంచింది. దీనికి సంబంధించి శుక్రవారం రోజు కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది.

వంట నూనెలను పండించే రైతులకు మద్దతుగా కేంద్రం నిర్ణయం
గతంలో వీటిపైన ఎటువంటి టాక్స్ లేదు కానీ ఇప్పుడు దాదాపు 20 శాతం వరకు ఇంపోర్టు డ్యూటీని పెంచడంతో వంటనూనె ల ధరలు పెరగనున్నాయని తెలుస్తుంది. ప్రపంచంలోనే అతి పెద్ద వంటనూనెల ఎగుమతి దారుగా ఉన్న భారతదేశం తీసుకున్న తాజా నిర్ణయం స్థానికంగా వంట నూనెలను పండించే రైతులకు మద్దతుగా తీసుకున్నట్టు సమాచారం.
పెరగనున్న సోయా, పామాయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్ రేట్లు
అయితే ఈ నిర్ణయంతో మనదేశంలో కూడా వంట నూనెల ధరలు పెరుగుతాయని తెలుస్తుంది. రిఫైన్డ్ ఫామ్, సోయాబీన్, సన్ ఫ్లవర్ ఆయిల్ పైన 12.5% నుంచి 32.5% వరకు సుంకం పెంచింది. దీంతో సోయా, పామాయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్ రేట్లు పెరగనున్నాయి. అయితే ఈ పంటలను సాగు చేసే రైతుల ప్రయోజనాలను కాపాడటానికి తీసుకున్న ఈ నిర్ణయం వంటనూనెల ధరల పెరుగుదలకు కారణం అవుతుంది.
మనదేశంలో ఈ ఆయిల్స్ ఇతర దేశాల నుండి దిగుమతి
ఎందుకంటే ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ నుంచి పామాయిల్ ఎక్కువగా మనం కొనుగోలు చేస్తున్నాం. దేశంలో నూనె డిమాండ్ లో 70 శాతానికి పైగా దిగుమతల ద్వారానే లభిస్తుంది. ఇక భారతదేశంలో 50% పైగా పామాయిల్ దిగుమతి అవుతుంది. అర్జెంటీనా, బ్రెజిల్, రష్యా ,ఉక్రెయిన్ నుంచి సోయా, సన్ ఫ్లవర్ ఆయిల్ ను దిగుమతి చేసుకుంటున్నాము.
దిగుమతి సుంకం పెరగటంతో నూనెల ధరలు పెరిగే అవకాశం
ఈ క్రమంలో మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఈ నూనెల ధరలు బాగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి త్వరలో వంటనూనెల ధరలు పెరగనున్న నేపథ్యంలో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇప్పుడే నూనెను కొనుగోలు చేసుకుని స్టాక్ పెట్టుకుంటే మంచిదని పలువురు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications