వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫిలిం నగర్లో హైటెక్ సెక్స్ రాకెట్: పట్టుబడ్డ పుణే మోడల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాదులో మరో సెక్స్ రాకెట్ గుట్టు రట్టయింది. నగరంలోని ఫిలిం నగర్‌లోని ఓ ప్రాంతంలో పోలీసులు వ్యభిచార ముఠాను పట్టుకున్నారు. పుణేకు చెందిన మోడల్‌ను పోలీసులు గుర్తించారు. మోడల్‌ను తీసుకు వచ్చి వ్యభిచార కేంద్రాన్ని నడుపుతున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడుల్లో ఇది బయట పడింది. మోడల్ పేరు మైనాగా తెలుస్తోంది. కాగా, లంగర్ హౌస్‌లోను మరో వ్యభిచార కేంద్రాన్ని రట్టు చేసిన పోలీసులు, ఎనిమిది మందిని అరెస్టు చేశారు.

విశాఖ జిల్లాలో 201 కిలోల గంజాయి పట్టివేత

విశాఖ జిల్లా చీడికాడ మండలం బైలపూడిలో పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. 201 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.

Cops bust high profile sex racket

తిరుమల శేషాచలం అడవుల్లో మళ్లీ మంటలు

తిరుమల శేషాచలం అడవుల్లో మళ్లీ మంటలు చెలరేగాయి. మొదటి ఘాట్ రోడ్ 16వ మలుపు దగ్గర అటవీ ప్రాంతంలో మంటలు అంటుకున్నాయి. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు అటవీ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. 16వ మలుపువద్ద చెలరేగిన మంటలు 8వ మలుపు వద్దకు చేరుకున్నాయి.

మూడు, నాలుగు కిలోమీటర్ల మేర మంటలు విస్తరించాయి. భారీగా మంటలు ఎగిసిపడుతుండడంతో టీటీడీ సిబ్బంది, ఫారెస్ట్ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. గాలులు వీస్తుండడంతో మంటలు వ్యాపిస్తున్నాయి.

English summary
Cops bust High Profile Sex racket in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X