తెలిసినవాడే తృప్తిమయి ప్రాణం తీశాడు !
బరంపురం: కళ్లికోట్ వర్శిటీ విద్యార్థి తృప్తిమయి పండా (21) హత్య కేసులో పురోగతి కనిపిస్తోంది. ఆమెకు బాగా తెలిసిన వారే హత్య చేసి ఉంటారని దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు అంటున్నారు.
ఛత్రపూర్ కు చెందిన తృప్తిమయి పండా స్థానిక అనంతనగర్ లోని ప్రయివేట్ హాస్టల్ లో నివాసం ఉంటుంది. ఆగస్టు 25వ తేది రాత్రి బయటకు వెళ్లిన ఆమె తిరిగిరాలేదు. ఆంధ్రప్రదేశ్ లోని సోంపేట-బారువ మధ్యగల బేసిరామచంద్రాపురం జాతీయ రహదారి పక్కన రక్తపుమడుగులో ఆమె మృతదేహాన్ని గుర్తించారు.
తృప్తిమయి పండా హత్య జరిగి వారం రోజులు గడిచినా ఇంత వరకు హంతకులను పట్టుకోలేదని విమర్శలు వస్తున్నాయి. తృప్తిమయి పండా హత్య కేసు ఆంధ్రప్రదేశ్, ఒడిశా పోలీసులకు సవాలుగా మారింది.

తృప్తిమయి పండా హత్య కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్న పోలీసులు కీలకమైన ఆధారాలు సేకరించారు. తృప్తిమయి పండా ప్రయాణిస్తున్న కారు ఒడిశా సరిహద్దు దాటుతున్నట్లు గిరిసిలా చెక్ పోస్టులోని సీసీ కెమెరాలలో నమోదు అయ్యింది.
గిరిసిలా చెక్ పోస్టులోని సీసీ కెమెరా పుటేజీలను గంజాం పోలీసులు సేకరించారు. అయితే దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించడానికి దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు నిరాకరిస్తున్నారు.
కేసు దర్యాప్తు జరుగుతున్నందున వివరాలు బయటకు చెబితే హత్య చేసిన వారు తప్పించుకునే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. తృప్తిమయి పండా హత్య కేసు ఆంధ్రప్రదేశ్, ఓడిశా పోలీసులకు సవాలుగా మారింది.
ఈ కేసు చేధించడానికి పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. తృప్తిమయి పండా ఫోన్ కాల్స్ లిస్టును ఆంధ్రప్రదేశ్ పోలీసులు సేకరించారని తెలిసింది. ఆమె ఎవరితో మాట్లాడింది, ఆమెకు ఎవరెవరు ఫోన్లు చేశారు అని పూర్తి వివరాలు బయటకులాగుతున్నారు.
ముఖ్యంగా ఆమె చివరి ఫోన్ కాల్ ఎవరికి చేసింది అని ఆరా తీస్తున్నారు. తృప్తిమయి పండాకు బాగా తెలిసిన వారే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమ వ్యవహారంలో ఆమె హత్యకు గురైయ్యిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications