Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎన్నికల వేళ.. జగన్‌కు గుడ్ న్యూస్

YS Jagan: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచార వేడి ఉధృతమైంది. అన్ని పార్టీలు ఎన్నికల సంగ్రామంలో చావో రేవో తేల్చుకోనున్నాయి. ఈ నెల 29వ తేదీ నాటితో నామినేషన్ల ప్రక్రియ మొత్తం ముగిసింది. మే 13వ తేదీన పోలింగ్. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకరవర్గాలకు ఒకే రోజున పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. జూన్ 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు.

పోలింగ్ గడువు దగ్గర పడుతోండటం అన్ని పార్టీలు కూడా జనంలోకి చొచ్చుకెళ్తోన్నాయి. ఇంటింటి ప్రచారాన్ని చేపట్టాయి. 2019 నాటి ఎన్నికల్లో సాధించిన పట్టును నిలుపుకోవడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను రూపొందించుకుంది. అప్పటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 151 అసెంబ్లీ, 22 లోక్‌సభ స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే.

Coromandel to set up Rs 1000 cr fertiliser plant at Kakinada in Andhra Pradesh

ఈ సంఖ్యను మరింత పెంచుకునే ప్రయత్నాల్లో ఉందా పార్టీ అగ్రనాయకత్వం. వైనాట్ 175/25 అనే నినాదంతో ప్రచార కార్యక్రమాలను చేపట్టింది. అటు తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ధీటుగా స్పందిస్తోంది. ఆయా పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్.. రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తోన్నారు.

ఈ పరిస్థితుల మధ్య దేశీయ పారిశ్రామిక దిగ్గజం కోరమాండల్.. కీలక ప్రకటన విడుదల చేసింది. కాకినాడ వద్ద ఎరువుల తయారీ ప్లాంట్‌ను నెలకొల్పనున్నట్లు వెల్లడించింది. దీని పెట్టుబడి వ్యయం 1,000 కోట్ల రూపాయల పైమాటే. ఫాస్ఫరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లాంట్లను కాకినాడ వద్ద నెలకొల్పనున్నట్లు తెలిపింది.

Coromandel to set up Rs 1000 cr fertiliser plant at Kakinada in Andhra Pradesh

ఈ మేరకు కంపెనీ సెక్రెటరీ బీ షణ్ముగసుందరం ఓ ప్రకటన విడుదల చేశారు. కాకినాడ సమీపంలో ఈ ప్లాంట్లను నెలకొల్పడానికి ఏపీ ప్రభుత్వం ఇదివరకే అనుమతి ఇచ్చిందని వివరించింది. ఈ ఏడాది జనవరి 30వ తేదీన 2023-24/110న ఓ లెటర్‌ను విడుదల చేసినట్లు పేర్కొంది.

రోజూ 650 టన్నుల మేర ఫాస్ఫరిక్ యాసిడ్, 1,800 టన్నుల మేర సల్ఫ్యూరిక్ యాసిడ్‌ను ఉత్పత్తి చేసేలా ఈ రెండు ప్లాంట్లను కూడా నిర్మించనున్నట్లు షణ్ముగ సుందరం చెప్పారు. ఈ రెండింటి నిర్మాణాలను రెండు సంవత్సరాల వ్యవధిలో పూర్తి చేస్తామని, అనంతరం వాటిని విస్తరిస్తామని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+