ఏపీలో భారీగా తగ్గిన కరోనా ఉద్ధృతి.. కొత్తగా ఎన్నికేసులంటే?

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కాస్త త‌గ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజులుగా భారీగా న‌మోద‌వుతున్న‌ పాజిటివ్ కేసులు .. ఇవాళ సగానికి దిగివచ్చాయి. గడిచిన 24 గంటల్లో 25,284 శాంపిల్స్ పరీక్షించగా.. 5879 మంది వైరస్ బారిన పడ్డారు. కేసులు ఒక్కసారిగా దిగిరావడం ఏపీ ప్రజలకు కాస్త ఊరటనిచ్చింది. కరోనా బారిన పడి ఏడుగురు మరణించినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడిచింది.

రాష్ట్రంలో 1,10,517 యాక్టివ్ కేసులు

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 22,76,370కి చేరింది. వైరస్ బారి నుంచి 21,48,343 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 11,384 మంది మహమ్మారి నుంచి కోలుకున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఒక్కరోజులు ఏడుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,615కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,10,517 యాక్టివ్ కేసులు ఉన్నాయని వెల్లడించింది.

అనంత‌పురంలో అత్య‌ధికంగా..

అనంత‌పురంలో అత్య‌ధికంగా..

రాష్ట్రంలో అత్యధికంగా అనంత‌పురంలో 856 కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి 823, కడప 776, కృష్ణా 650, కర్నూలు 483, పశ్చిమగోదావరి 456, గుంటూరు 421 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది. అటు నెల్లూరు 366, విశాఖపట్నం 340, ప్రశాశం 321, చిత్తూరు 295, శ్రీకాకుళం 80, విజయనగరంలో అత్యల్పంగా 12 కొత్త కరోనా కేసులు వచ్చాయి. నిన్నటితో పోలిస్తే అన్ని జిల్లాలో కేసుల సంఖ్య సగానికి తగ్గాయి.

దేశ వ్యాప్తంగా త‌గ్గిన కేసులు.. పెరిగిన మ‌ర‌ణాలు

దేశ వ్యాప్తంగా త‌గ్గిన కేసులు.. పెరిగిన మ‌ర‌ణాలు

దేశవ్యాప్తంగా కూడా క్రమేణా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కానీ మరణాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఒక్కరోజులో.. 2,09,918 కేసులు నమోదయ్యాయి. మహమ్మారితో పోరాడుతూ ఆదివారం 959 మంది మరణించారు. 2,62,628 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 15.77 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

శ‌ర‌వేగంగా వ్యాక్సినేష‌న్‌

శ‌ర‌వేగంగా వ్యాక్సినేష‌న్‌

దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 4,13,02,440 కాగా, మొత్తం 4,95,050 మృతి చెందారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 18,31,268 ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,89,76,122గా నిర్దారించింది. అటు దేశ వ్యాప్తంగా టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. ఆదివారం 28,90,986 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 166,03,96,227కు చేరింది. కరోనా తీవ్ర‌ ప్రభావం చూపిన రాష్ట్రాల్లోనూ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+