రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీలపై ఛైర్మన్ సంచలన నిర్ణయం..!!

ఏపీలో శాసన మండలి కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రస్తుతం కొనసాగు తున్నాయి. తొలి రోజు గవర్నర్ ప్రసంగానికి కొంత సేపు హాజరైన వైసీపీ.. తరువాత గైర్హాజరు అవుతోంది. మండలిలో వైసీపీ- కూటమి ప్రభుత్వం ప్రస్తుతం హోరా హోరీ కొనసాగుతోంది. ఇందాపూర్ డెయిరీ పైన చర్చ జరగాలని వైసీపీ పట్టుబడుతున్న వేళ ఈ రోజు అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇదే సమయంలో వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీల విషయంలో మండలి ఛైర్మన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీకి చెందిన పలువురు ముఖ్య నేతలు పార్టీ వీడి కూటమి పార్టీల్లో చేరారు. రాజ్యసభ సభ్యుల నుంచి ఎమ్మెల్సీల వరకు రాజీనామాలు చేసారు. వైసీపీ నుంచి మండలిలో సభ్యులుగా కొనసాగుతున్న ఆరుగురు రాజీనామాలు చేసారు. తమ రాజీనామాలు ఆమోదించాలని గతంలోనే ఛైర్మన్ ను కోరారు. కాగా.. ఇప్పుడు వారికి ఛైర్మన్ నోటీసులు జారీ చేసారు. కల్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, మర్రి రాజశేఖర్‎కు నోటీసులు జారీ చేసిన ఛైర్మన్ ఈ నెల 25న విచారణకు రావాలని సూచించారు.

council-chairman-notices-for-ysrcp-resigned-mlcs-to-take-decision-on-their-resignations-here-the-d

అదే విధంగా రాజీనామా చేసిన రో ఎమ్మెల్సీ జయమంగళం వెంకట రమణకు ఈ నెల 25న విచారణకు రావాలని నోటీసులు జారీ అయ్యాయి. అటు శాసనసభలో 11 స్థానాలకే పరిమితం అయిన వైసీపీ.. ఇప్పుడు మండలిలో ఆధిక్యంలో ఉంది. కాగా.. ఆరుగురు సభ్యుల రాజీనామా పైన మండలి ఛైర్మన్ తీసుకునే నిర్ణయం ఆధారంగా వీరి భవితవ్యం ఏంటనేది స్పష్టత రానుంది.

ఛైర్మన్ తుది నిర్ణయం పై ఉత్కంఠ

కాగా.. ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన పలువురు ఎమ్మెల్సీలు శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజును కలిశారు. రాజీనామా అంశంపై ఆరుగురు ఎమ్మెల్సీలు వివరణ ఇచ్చారు. తమ రాజీనామాను ఆమోదించాలని మండలి చైర్మన్‌ను ఎమ్మెల్సీలు కోరారు. ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, కళ్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్‌తో పాటు జయమంగళ వెంకటరమణ, పోతుల సునీత.. చైర్మన్‌ ను కలిసిన వారిలో ఉన్నారు. తాము స్వచ్ఛందంగా రాజీనామా చేసామని స్పష్టం చేసారు. ఎవరి ప్రోద్భలంతోనైనా, లేక ప్రలోభాలకు లోనై రాజీనామాలు చేశారా అని ఎమ్మెల్సీలను మండలి చైర్మన్ ప్రశ్నించారు. పదవీకాలం తక్కువే ఉన్నందున ఎమ్మెల్సీలు కొనసాగవచ్చు కదా అని సూచించారు.

రాజీనామా ఉపసంహరణ పునరాలోచన ఏమైనా ఉందా అని ఎమ్మెల్సీలను చైర్మన్ రాజు అడిగారు. ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉన్నామని ఇంకా ఎన్నిసార్లు అడిగినా తమది ఇదే సమాధానమని వారు స్పష్టం చేశారు. 2024 ఆగస్టులో ఈ ఎమ్మెల్సీలు రాజీనామా చేసారు. ఇప్పుడు, ఛైర్మన్ వారికి నోటీసులు ఇవ్వటంతో.. వారి వివరణ తీసుకున్న తరువాత రాజీనామాల పైన తన నిర్ణయం ప్రకటించనున్నారు. దీంతో.. ఛైర్మన్ నిర్ణయం ఏంటనేది రాజాకీయంగా ఉత్కంఠగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+