PSLV C-52: కౌంట్ డౌన్ ప్రారంభం - భూ పరిశీలనకు ఉపగ్రహం : 14న రోదసిలోకి..!!
సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి మరో కీలక ప్రయోగానికి కౌంట్ డౌన్ మొదలైంది. భూ పరిశీలన ఉపగ్రహం రాడర్ ఇమేజింగ్ శాటిలైట్ (ఈఓఎస్-4)ను ఇస్రో సోమవారం రోదసిలోకి ప్రవేశపెట్టనుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఈనెల 14న ఉదయం 5 గంటల 59 నిమిషాలకు..రాకెట్ దూసుకెళ్లనుంది. మొదటి ప్రయోగ వేదిక నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ సీ-52 వాహక నౌక ప్రయోగించనున్నారు. ప్రయోగానికి ముందు నిర్వహించే కౌంట్ డౌన్ ప్రక్రియ ఈ ఉదయం 4 గంటల 29 నిమిషాలకు మొదలైంది.

14న ఉదయం కక్ష్యలోకి
నిరంతరాయంగా 25 గంటలు 30 నిమిషాలు కొనసాగాక వాహననౌక నింగిలోకి వెళ్లనుంది. పీఎస్ఎల్వీ సీ-52,ఐఆర్ -1ఏ తో పాటుగా ఐఎన్ఎస్ -2-టీడీ, విద్యార్థులు రూపకల్పన చేసిన ఇన్ స్పైర్ శాట్-1 ఉపగ్రహాలను మోసుకెళ్లనుంది. ఉపగ్రహాలను 529 కిలోమీటర్ల ఎత్తులోని సన్ సింక్రసన్ కక్ష్యలో ప్రవేశపెడుతుంది. ఈఓఎస్-4 ఉపగ్రహం వ్యవసాయం, అటవీ ప్లాంటేషన్, భూమిపై జరిగే మార్పులు, వరదలు, వాతావరణం వంటి అనువర్తనాల కోసం అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ అత్యంత నాణ్యమైన ఛాయా చిత్రాల ద్వారా సమాచారాన్ని అందిస్తుంది.

కౌంట్ డౌన్ ప్రారంభానికి ముందు
ఎస్‌ఎల్‌వీ - సి52 నమూనాకు శనివారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. షార్‌లోని బ్రహ్మప్రకాష్ హాలులో శనివారం ఎంఆర్‌ఆర్ (మిషన్ రెడీనెస్ రెవ్యూ) సమావే శం నిర్వహించారు. రాకెట్‌కు అన్ని పరీక్షలు నిర్వహించి ప్రయోగాన్ని లాంచ్ ఆథరైజేషన్ బోర్డు చైర్మన్ రాజరాజన్‌కు అప్పగించారు. నమూనాను ఇస్రో శాస్త్రవేత్తల బృందం తిరుమలకు తీసుకువచ్చింది. వారికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. నమూనాను శ్రీవారి మూల విరాట్ పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందజేశారు.
Recommended Video

కరోనా తరువాత తొలి ప్రయోగం
కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుండటంతో మరిన్ని ప్రయోగాలకు సిద్ధమవుతున్నామని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. చంద్రయాన్-3, గగన్‌యాన్-1కు సంబంధించి పలు ప్రయోగాత్మక పరీక్షలు చేపడతామన్నారు. గత రెండేళ్లుగా కరోనా కారణంగా ప్రయోగాలకు అంతరాయం కలిగిందన్నారు. ఇస్రో చైర్మన్‌గా తనకు ఇది తొలి ప్రయోగం కావడంతో విజయవంతం కావాలని ఆకాంక్షించారు. రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ దేశంలో ఉన్న సామాన్యుడికి కూడా దీర్ఘకాలిక సేవలందిస్తుందని తెలిపారు. పీఎస్‌ఎల్‌వీ సీ-53 ప్రయోగానికి కూడా సిద్ధమవుతున్నామని తెలిపారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications