PSLV C60 ప్రయోగానికి కౌంట్‌డౌన్ షురూ

PSLV C60: పీఎస్ఎల్వీ సీ60 ప్రయోగానికి అంతా సిద్ధమైంది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నిగిలోకి దూసుకెళ్లేందుకు పీఎస్ఎల్వీ సీ60కి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. వాహకనౌక అనుసంధానం పూర్తయిన తర్వాత వివిధ పరీక్షలు నిర్వహించారు.

వాహకనౌకలోని అన్ని దశలు పనిచేస్తున్నట్లు శాస్త్రవేత్తలు ధృవీకరించారు. పీఎస్ఎల్వీ ప్రయోగానికి 25 గంటలపాటు కౌంట్‌డౌన్ నిర్వహించేలా శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 8.58 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. ఇది నిరంతరాయంగా కొనసాగిన తర్వాత సోమవారం రాత్రి 9.58 గంటలకు పీఎస్ఎల్వీ సీ60 కక్ష్యలోకి దూసుకెళ్లనుంది.

Countdown begins for PSLV C60 launch

అంతరిక్షంలోనే 2 చిన్న వ్యోమనౌకలను డాకింగ్, అన్ డాకింగ్ చేయగల సాంకేతిక అభివృద్ధే లక్ష్యంగా ఈ ప్రయోగం సాగనుంది. స్పాడెక్స్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ రాకెట్‌ను ప్రయోగిస్తున్నారు. PSLV C-60 రాకెట్ 24 ప్రోబ్స్‌ని మోసుకెళ్లనుంది. ప్రోబ్స్ రాకెట్ నాల్గవ దశలో ఉంటాయి. దీనిని బూమ్-4 అని పిలుస్తారు. వీటిలో 14 ప్రోబ్‌లను ఇస్రో తయారు చేసింది. మిగిలిన 10 సాధనాలను విద్యా సంస్థలు, ఇతర ప్రైవేట్ సంస్థలు అభివృద్ధి చేశాయి.

PSLV C60 రాకెట్ ఒక్కొక్కటి 220 కిలోల 'SpaDeX - A', 'SpaDeX - B' అనే 2 చిన్న ఉపగ్రహాలను మోసుకెళ్లనుంది. ఈ రెండు ఉపగ్రహాలను భూమికి 470 కిలోమీటర్ల ఎత్తులో వేర్వేరు కక్ష్యల్లో ఉంచనున్నారు. కాగా, 2035 నాటికి భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కూడా యోచిస్తున్నారు. దీని కోసం ప్రీ ప్రొడక్షన్ ప్రాజెక్ట్‌గా ప్రస్తుతం 'స్పాడెక్స్' అనే ప్రాజెక్ట్ అమలులో ఉంది. దీని కోసం పి.ఎస్.ఎల్.వి సోమవారం శ్రీహరికోట ప్రయోగ వేదిక నుంచి సీ60 రాకెట్‌ను ప్రయోగించనున్నారు.

చంద్రుడిని అన్వేషించడానికి, ప్రోబ్ శాంపిల్స్‌తో భూమికి తిరిగి రావడానికి, అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఈ సాంకేతిక ప్రయోగం సహాయపడనుంది. అంతరిక్షంలో రెండు వేర్వేరు వ్యోమనౌకలను అనుసంధానం చేసే పరీక్ష విజయవంతమైతే, ఈ ఘనత సాధించిన 4వ దేశంగా భారత్ నిలుస్తుందని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+