భార్య తాళాల వ్యూహం, భర్త చోరీలు: పోలీసులకు చిక్కిన దంపతులు

కడప: రేడీమేడ్ షోరూం నిర్వహిస్తూ అప్పుల పాలైన ఓ వ్యక్తి తన భార్యతో కలిసి ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు. భార్యాభర్తలిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. వారిని అరెస్టు చేసి 450 గ్రాముల బంగారును స్వాధీనం చేసుకున్నట్లు కడప డిఎస్పీ అశోక్‌కుమార్ సోమవారం మీడియా సమావేశంలో తెలిపారు. గత కొంతకాలంగా నగరానికి చెందిన పసుపులేటి శంకర్, మంజువాణి అలియాస్ వాణి అలియాస్ గనమంతు మంజువాణి 2013 డిసెంబర్ నుండి నగరంలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్, టూ టౌన్ పోలీస్‌స్టేషన్, తాలూకా పోలీస్‌స్టేషన్, ఐపిఐ పరిధులలో 12 దొంగతనాలకు పాల్పడినట్లు ఆయన తెలిపారు.

కానిస్టేబుల్ ఇంట్లో గత నెల 14వ తేదీన దొంగతనానికి పాల్పడే యత్నంలో శంకర్ పోలీసలకు చిక్కాడు. ఆ ప్రయత్నం జరిగిన తర్వాత ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దంపతులను పోలీసులు సోమవారంనాడు పట్టుకున్నారు. వారి నుంచి రూ.12 లక్షల విలువైన 405 గ్రాముల ఆభరణాలను, రెండు దిచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పెండ్లిమర్రి మండలం నంది మండలానికి చెందిన పసుపులేటి చంద్రశేఖర్ అలియాస్ శేఖర్ నెహా రెడీమేడ్ షోరూం పెట్టుకుని జీవించేవాడు. ఆ షాపు దివాళా తీయడంతో అప్పుల పాలై దుర్వ్యసనాలకు లోనై చోరీలకు మరిగాడు.

Couple arrested for theft in Kadapa district

శేఖర్ ప్రస్తుతం నగరంలోని ఓ ప్రముఖ షాపింగ్ మాల్‌లో పనిచేస్తూ రాజారెడ్డివీధిలో నివసిస్తున్నాడు. అతని భార్య మంజువాణి నగర శివారులోని ఓ ప్రముఖ కార్పోరేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. తన సహచర ఉపాధ్యాయులు నివసించే ప్రాంతాలను మొదట తన భర్తతో సహా వెళ్లి ఆమె పరిశీలిస్తుంది. పాఠశాల వేళల్లో ఉపాధ్యాయుల హ్యాండ్ బ్యాగుల్లో ఉండే తాళాలను వారికి తెలియకుండా తీసుకుని భర్తకు అందజేస్తుంది. తర్వాత ఆమె భర్త సదరు ఇళ్లకు వెళ్లి తాళాలు తీసి లోపల ఉన్న వస్తువులను దోచుకుంటాడు. తర్వాత ఏమీ ఎరగనట్లు తాళాలను భార్య చేతికి ఇస్తే ఆమె సదరు ఉపాధ్యాయుల తాళాలను వారి బ్యాగుల్లోనే గమనించకుండా దాచేస్తుంది.

ఒక వేళ తాళాలు కనిపించకుండా బాధితులు వెతుకుంటే తనకు ఫలానా చోట దొరికాయని ఆమె వారికి అందజేస్తుంది. గత నెల 14వ తేదీన బాలల దినోత్సవంనాడు, అదే పాఠశాలలో బాలాజీనగర్‌లో నివసిస్తున్న ఓ ఉపాధ్యాయురాలు పాఠశాలకు వెళ్లింది. సదరు ఉపాధ్యాయురాలి భర్త ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అతను టిఫిన్ తినేందుకు ఇంటికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఉన్న నిందితుడు చంద్రశేఖర్ అలియాస్ శంకర్ కానిస్టేబుల్‌ను చూసి బిత్తరపోయి పారిపోయాడు. తర్వాత అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తే భార్యాభర్తల గుట్టు బయటపడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+