సందీప్ ఎడమచేతిపై పచ్చబొట్టు: అలా చేస్తే.. ఇంత ఘోరం జరగకపోయేది?
సందీప్ తన ఎడమ చేతిపై 'ఎం' అనే అక్షరం పచ్చబొట్టు పొడిపించుకున్నట్లు తెలుస్తోంది
వేటపాలెం: ప్రేమ పెళ్లిళ్లకు సవాలక్ష సవాళ్లు. కులం, మతం, ఆస్తి, అంతస్తు.. వగైరా. వీటన్నింటిని దాటుకుని పెళ్లి దాకా వెళ్లినా.. ఆపై అంతా సజావుగా సాగుతుందనుకోవడానికి లేదు. సైరాత్ లాంటి సినిమాలను తలపించే కథలు మన చుట్టూ ఉన్న సమాజంలో బోలేడు.
ఎంత వెల్ సెటిల్డ్ అయినా సరే.. ప్రేమ పెళ్లికి 'నో' అనేవాళ్లే ఎక్కువ. అలాంటిది.. చదువు కూడా పూర్తి కాకుండానే ప్రేమ పెళ్లంటే ఇంకా కష్టం. ఈ ఆలోచనలే చీరాల ప్రేమ జంట సందీప్-మౌనికలను ఉక్కిరిబిక్కిరి చేసుంటాయి. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితిలో పెళ్లయితే చేసుకోగలిగారు కానీ ఇంట్లో వాళ్లకు నచ్చజెప్పే ధైర్యం చేయలేకపోయారు.

క్షణికావేశమే:
వేటపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో వీరిద్దరు ఆత్మహత్య చేసుకోవడంతో.. అటు వారి తల్లిదండ్రులతో పాటు ఇటు స్నేహితులు సైతం తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. క్షణికావేశమే వారిని బలితీసుకుందని వాపోతున్నారు.

సందీప్ చేతిపై పచ్చబొట్టు:
కాగా, సందీప్ తన ఎడమ చేతిపై 'ఎం' అనే అక్షరం పచ్చబొట్టు పొడిపించుకున్నట్లు తెలుస్తోంది. మౌనికపై ఉన్న ప్రేమకు గుర్తుగా అతను పచ్చబొట్టు పొడిపించుకుని ఉంటాడని పోలీసులు చెబుతున్నారు. వారి ప్రేమ, పెళ్లి విషయమేది స్నేహితులకు తెలియకపోవడం గమనార్హం.

ఎవరికీ చెప్పలేదు:
పెళ్లి చేసుకోవడానికి విజయవాడ వెళ్లిన సందర్భంలోను వారు ఎవరికీ సమాచారం అందించలేదు. పెళ్లయితే చేసుకోగలిగారు కానీ ఇంట్లోవాళ్లకు చెప్పడానికి ధైర్యం సరిపోలేదు. రెండు కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణలు చోటు చేసుకుంటాయని ఆందోళన చెందారు. వీటన్నింటి కన్నా బలవన్మరణం చేసుకోవడమే కరెక్ట్ అనుకున్నారు.

అలా చేస్తే.. పరిస్థితి వేరుగా ఉండేదేమో:
మౌనిక కూడా ఇందుకు అంగీకరించడంతో.. ఇద్దరూ కలిసి వేటపాలెం వైపు బయలుదేరారు. అక్కడికి వెళ్లేముందు తాము ఆత్మహత్య చేసుకోబోతున్నామని సందీప్ తన స్నేహితుడికి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేశాడు. అనంతరం ఫోన్ స్విచాఫ్ చేసుకున్నాడు. ఆపై రైలు పట్టాలపై ఇద్దరూ విగత జీవులుగా కనిపించారు.
క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం వల్లే వారి ప్రాణాలు పోయాయని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. స్నేహితుడికి మెసేజ్ చేసిన తర్వాత కొద్ది నిముషాలు వారు వేచి చూసినా పరిస్థితి మరోలా ఉండేదేమో అంటున్నారు.
-
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!!












Click it and Unblock the Notifications