అన్నయ్యనే, చెల్లెని కాటేశాడు: గర్భవతిని చేశాడు, బిడ్డను కన్నది
వరుసకు అన్నయ్య అయిన ఆ వ్యక్తి చెల్లెని కాటేశాడు. దాంతో ఆమె గర్భవతి అయి ఓ బిడ్డను కన్నది. ఆస్పత్రిలోనే శిశువును వదిలేసి వెళ్లడానికి ఆమె చేసిన ప్రయత్నం ఫలించలేదు.
అనంతపురం: ఓ వ్యక్తి అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. వావివరుసలు మరిచిపోయి సమాజం తలదించుకునే ఘటనకు ఒడిగట్టాడు. వరుసకు అన్నయ్య అయిన ఆ వ్యక్తి చెల్లెని కాటేశాడు. దాంతో ఆమె గర్భవతి అయి ఓ బిడ్డను కన్నది.
ఆస్పత్రిలోనే శిశువును వదిలేసి వెళ్లడానికి ఆమె చేసిన ప్రయత్నం ఫలించలేదు. విషయం బయటకు వచ్చింది. దాంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వజ్రకరూరు మండలానికి చెందిన 20 ఏళ్ల వయస్సు గల యువతిని సమీప బంధువు మోసం చేశాడు.
ఆమె గర్భం దాల్చడంతో కొంతకాలం ఆమెతోపాటు కుటుంబ సభ్యులు వలస వెళ్లారు. మొదట గర్భం దాల్చిన యువతి సోమవారం కడుపు నొప్పితో బాధపడుతున్నట్లు ఆస్పత్రిలో చేరింది. ఆమె గర్భం దాల్చి, నెలలు నిండినట్లు ఆస్పత్రివర్గాలు గుర్తించి మెటర్నటీ గదిలోకి తీసుకెళ్లారు. ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

ఆమె ప్రసవించిన కొన్ని నిమిషాలకే అక్కడి నుంచి జారుకునే ప్రయత్నం చేసింది. ఆస్పత్రి సిబ్బంది గుర్తించి ఆడశివువును తిరిగి తల్లికి అప్పగించారు. ఈ విషయంగా బిడ్డను ప్రసవించిన తల్లి మాట్లాడేందుకు ఇష్టపడలేదు. తాను మోసపోయానంటూ బోరున ఏడ్చేసింది.
బాధితురాలి తల్లిదండ్రులను ప్రశ్నిస్తే, తమ కూతురు పొలం పనులకు వెళ్లేదని తెలిపారు. చదువులేని తమ బిడ్డను పెదనాన్న కుమారుడు, వరుసకు అన్న వంచించాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోతున్నామనీ, వివరాలు చెప్పడానికి నిరాకరించారు. యువతి ప్రసవానికి వెళ్లినట్లు తెలుసుకున్న యువకుడు పరారైనట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications