ఏపీలో పుట్ట బద్దలు: ఒకేరోజు 56 మంది బలి.. కొత్తగా 5041 కరోనా కేసులు.. తూర్పుగోదావరి కకావికలం..
కరోనా కట్టడి చర్యల్లో దేశంలోనే టాప్ గా నిలిచిన ఆంధ్రప్రదేశ్.. ఇప్పుడు కరోనా వ్యప్తి, పాజిటివ్ కేసుల్లోనూ పైపైకి దూసుకుపోతున్నది. గడిచిన వారం రోజులుగా రాష్ట్రంలో కొత్త కేసుల సంఖ్య భారీగా ఉంటుడటంతో కొవిడ్ ప్రభావిత రాష్ట్రాల జాబితాలో టాప్ 5వ స్థానానికి ఏపీ చేరింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిన బులిటెన్ లో.. సంఖ్యలు సంచలనాత్మకంగా ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతున్నది.
Recommended Video
ఏపీ ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ఆదివారం ఒక్కరోజే కొత్తగా 5041 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 49,650కు పెరిగింది. ఇందులో వ్యాధి నుంచి కోలుకన్నవారి సంఖ్య 22,890కాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 26,118గా ఉంది. అలాగే, ఆదివారం మరణాల సంఖ్య భారీగా నమోదైంది. ఇవాళ ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 56 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇప్పటిదాకా మోస్ట్ ఎఫెక్టెడ్ జిల్లాగా ఉన్న కర్నూలును పక్కకు నెట్టేస్తూ ఓవరాల్ కేసుల్లో తూర్పు గోదావరి జిల్లా తొలి స్థానాకికి ఎగబాకడం విషాదకరం. జిల్లాలో ఓకేరోజు ఏకంగా 10 మంది చనిపోగా, కొత్తగా 647 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. గడిచిన 10 రోజులుగా జిల్లాలో కొత్త కేసులు, మరణాలు అధికంగా నమోదవుతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 6146కు, మరణాల సంఖ్య 56కు పెరిగింది. కర్నూలు జిల్లాలో మొత్తం కేసులు 6045, మరణాలు 123గా ఉన్నాయి.
గడిచిన 24 గంటల్లో కొత్తగా 31,148 శాంపిళ్లను టెస్టు చేసినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ఇప్పటిదాకా చేసిన మొత్తం టెస్టులు 13.15లక్షలకు చేరినట్లు పేర్కొన్నారు. ఆదివారం దాదాపు అన్ని జిల్లాలో కొత్త కేసులు భారీగా వచ్చాయి. అనంతపురం(637), శ్రీకాకుళం(535), చిత్తూరు(440), వెస్ట్ గోదావరి(393), గుంటూరు(354) కొత్త కేసులు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications