పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబుకు కరోనా - ప్రత్యేక హెలికాప్టర్‌లో బెంగళూరుకు - మెరుగైన చికిత్స కోసం

దేశంలోనే అత్యధిక యాక్టివ్ కేసులున్న రెండో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కొనసాగుతున్నది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు వరుసగా ఇన్ఫెక్షన్ కు గురవుతున్నారు. ఈ క్రమంలోనే అధికార వైసీపీకి చెందిన పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు కూడా వైరస్ సోకింది. తొలుత కాకినాడలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఆయన.. మెరుగైన వైద్యం కోసం ఆదివారం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బెంగళూరు వెళ్లిపోయారు.

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు పిఠాపురం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యాధికారి విజయ్ శేఖర్ శనివారం వెల్లడించారు. టెస్టులు వచ్చిన కొద్దిసేపటికే ఎమ్మెల్యే దొరబాబు కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. తనకు పాజిటివ్‌ వచ్చిందని స్వయంగా ప్రకటించిన ఆయన.. ఇటీవల తనను కలిసిన వారందరూ టెస్టు చేయించుకోవాలని సూచించారు. దొరబాబుకు కొవిడ్‌ రావడంతో సీఎం జగన్‌ ఫోన్‌లో పరామర్శించారు. ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా,

covid-19: Pitapuram YSRCP MLA Dorababu Airlifted to Bengaluru

దొరబాబును ఆయన కుటుంబీకులు ఆదివారం హెలికాప్టర్‌లో బెంగళూరు తరలించారు. కాకినాడలోని జిల్లా ఎస్పీ కార్యాలయం హెలిప్యాడ్‌ నుంచి దొరబాబు బెంగళూరుకు పయనమయ్యారు. దొరబాబు వెంట ఆయన భార్యతో పాటు మరో ఇద్దరు బంధువులు హెలికాప్టర్‌లో వెళ్లారు. మెరుగైన వైద్యం కోసం ఆయన్ను బెంగళూరు తీసుకెళ్లారు. బెంగళూరులో దొరబాబు సమీప బంధువుల ఆస్పత్రి ఉండటంతో ఆయన్ను అక్కడికి తీసుకెళ్లినట్లు తెలిసింది.

covid-19: Pitapuram YSRCP MLA Dorababu Airlifted to Bengaluru

దొరబాబు ప్రాతినిధ్యం వహిస్తోన్న తూర్పుగోదావరి జిల్లాలో కరోనా ఉధృతి తీవ్రంగా ఉంది. గడిచిన మూడు వారాలుగా ప్రతిరోజూ 1000కి తక్కువ కాకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం నాటికి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 66,948కి పెరిగింది. కరోనా వల్ల తూర్పుగోదావరిలో మొత్తం 427 మంది ప్రాణాలు కోల్పోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+