సిపిగా సాదిక్: పవన్ కళ్యాణ్‌ను చూడాలని శ్రీజ

హైదరాబాద్‌: తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పదేళ్ల బాలుడు సాదిక్ కోరికను హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి తీర్చారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సాదిక్‌కు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌గా పనిచేయాలని కోరి. మేక్ అండ్ విష్ స్వచ్ఛంద సంస్థ ద్వారా విషయం తెలుసుకున్న మహేందర్ రెడ్డి బాలుడి కోరికను నెరవేర్చారు.

బుధవారం ఉదయం సాదిక్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించాడు. మీడియా అడిగిన ఓ ప్రశ్నకు తాను ఇప్పుడు పోలీసు కమిషనర్‌ను కాదని మహేందర్ రెడ్డి చలోక్తి విసిరారు. మైక్ సాదిక్‌కు ఇచ్చి మాట్లాడాలని చెప్పారు. హైదరాబాదులో రౌడీలను రూపుమాపుతానని సాదిక్ పోలీసు కమిషనర్ హోదాలో చెప్పాడు. పోలీసు కమిషనర్ సీట్లో సాదిక్ కూర్చుని చిరునవ్వులు చిందించాడు.

CP Mahender Reddy fulfills Sadiq wish

తన కుమారుడి కోరికను నెరవేర్చినందుకు మహేందర్ రెడ్డికి సాదిక్ తండ్రి కృతజ్ఞతలు తెలిపారు. సాదిక్ త్వరగా కోలుకుని, అందరిలాగే బాగా చదువుకుని పైకి ఎదగాలని మహేందర్ రెడ్డి ఆకాంక్షించారు. పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి ముందుకు రావడంతో సాదిక్‌లో గత 24 గంటల్లో ఎంతో మార్పు వచ్చిందని మేక్ అండ్ విష్ సంస్థ నిర్వాహకులు చెప్పారు.

ఖమ్మంలో తీ్వ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్న శ్రీజ అనే బాలికకు సినీ హీరో పవన్ కళ్యాణ్‌ను కలవాలనేది కోరిక అని నిర్వహకులు కోరారు. పవన్ కళ్యాణ్ అందుకు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారుల కోరికలను నెరవేర్చడానికి సెలబ్రెటీలు ముందుకు రావాలని వారు కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు శరత్ అనే బాలుడి కోరికను నెరవేర్చిన విషయాన్ని వారు గుర్తు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+