పవన్ పార్టీని స్వాగతిస్తాం: నారాయణ, కెసిఆర్‌పై దానం

CPI invites Pawan Kalyan party: Narayana
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజాదరణ ఉన్న వ్యక్తి అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ అన్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెడుతారనే విషయాలను తాను కూడా గమనిస్తున్నట్లు ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రజలు చైతన్యవంతులు అవుతారంటే పవన్ కళ్యాణ్ పార్టీ పెడితే తాము స్వాగతిస్తామని చెప్పారు.

కాగా, పార్టీ పెట్టాలని నిర్ణయం తీసుకున్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కిరణ్ కుమార్ రెడ్డి అదును తప్పి వ్యవసాయం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో పొత్తుల విషయంపై తాము ఇంకా ఏ పార్టీతోనూ చర్చలు జరపలేదని ఆయన చెప్పారు

తెలంగాణలో దొరలరాజ్యం తెచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ప్రయత్నిస్తున్నారని, అలాంటి దొరల రాజ్యాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని మాజీ మంత్రి దానం నాగేందర్ స్పష్టం చేశారు. కెసిఆర్ తాను ముఖ్యమంత్రి అయి, కుమారుడు కెటిఆర్‌ను హోంమంత్రిగా చేయాలని, కూతురుకు మంత్రి పదవి ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు.

కెసిఆర్ ఆటలు సాగవని, సామాజిక తెలంగాణ కావాలని దానం డిమాండ్ చేశారు. తెలంగాణలో బలహీన వర్గాలకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని తమ అధినేత్రి సోనియా గాంధీకి చెప్పినట్లు ఆయన వెల్లడించారు. తెరాసతో పొత్తు ఉన్నా లేకపోయినా తెలంగాణలో కాంగ్రెస్ ఘన విజయం ఖాయమని దానం అభిప్రాయపడ్డారు. తాను తెలంగాణ పిసిసి రేసులో ఉన్నట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+