ఆయన వల్లే చంద్రబాబుకు బెయిల్, జరిగేదిదే -నారాయణ సంచలనం..!!
టీడీపీ అధినేత చంద్రబాబు కేసులు..అరెస్ట్ పైన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏ క్షణంలో అయినా చంద్రబాబు మళ్లీ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. చంద్రబాబుకు బెయిల్ రావటం గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. టీడీపీ-బీజేపీ మధ్య పొత్తు కోసం పవన్ ప్రయత్నిస్తున్నారని..మూడు పార్టీలు కలిసి ఏపీలో పోటీ చేస్తే జగన్ గెలవటం ఖాయమని నారాయణ జోస్యం చెప్పారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు పైన ఏపీ సీఐడీ పలు కేసులు నమోదు చేసింది. స్కిల్ కేసులో 53 రోజులు రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు మధ్యంతర బెయిల్ పైన బయటకు వచ్చారు. తాజాగా ఆయనకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఇతర కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఈ నెల 30వ తేదీ వరకు సీఐడీ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు స్పష్టం చేసింది. ఇదే సమయంలో తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకుండా తప్పకుంది. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఉన్న సీపీఐ నారాయణ ఇప్పుడు చంద్రబాబు కేసులు..అరెస్ట్.. బీజేపీతో పొత్తు పైన కీలక వ్యాఖ్యలు చేసారు.

ఏపీలో తాము టీడీపీతో కలవాలని చూస్తున్నామని..టీడీపీ పక్క పార్టీ వైపు చూస్తోందని వ్యాఖ్యానించారు. జనసేనాని పవన్ మధ్యవర్తిత్వం వహిస్తూ బీజేపీతో టీడీపీని కలిపే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. అయితే, ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే మాత్రం మళ్లీ జగన్ అధికారంలోకి రావటం ఖాయమని చెప్పుకొచ్చారు. టీడీపీ గనుక బీజేపీతో కలవకుంటే మాత్రం తాము మద్దతు ఇస్తామని స్పష్టం చేసారు. ఇదే సమయంలో చంద్రబాబుది కండీషనల్ బెయిల్ అని వ్యాఖ్యానించారు. బీజేపీ అగ్రనేత అమిత్ షా తో లోకేశ్ కలిసిన తరువాతనే పరిణామాలు మారాయన్నారు. షా వల్లనే చంద్రబాబుకు బెయిల్ వచ్చిందని చెప్పిన నారాయణ..చంద్రబాబు మళ్లీ ఎప్పుడైనా అరెస్ట్ కావచ్చొంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.












Click it and Unblock the Notifications