గవర్నర్...బఫూన్ అనే పదాన్ని ఉపసంహరించుకుంటున్నా:సిపిఐ నారాయణ
కృష్ణా: గవర్నర్ నరసింహన్‌ను తాను విమర్శిస్తూ చేసిన బఫూన్ అనే పదాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. అయితే రిపబ్లిక్ డే రోజు రాజ్‌భవన్‌లో జరగనున్న ఎట్‌హోమ్ కార్యక్రమానికి వెళ్లేదిలేదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
సోమవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో గవర్నర్ నరసింహన్ పై విమర్శల సందర్భంగా సిపిఐ నారాయణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా గవర్నర్ నరసింహన్ ను ఉద్దేశించి బఫూన్ గా అభివర్ణించడం సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో సిపిఐ నారాయణ తన వ్యాఖ్యలపై దిద్దుబాటు చర్యలు చేపట్టారు. గవర్నర్ ను ఉద్దేశించి తాను చేసిన బఫూన్ అనే పదాన్ని వెనక్కితీసుకుంటున్నానని నారాయణ చెప్పారు.

తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కేంద్రానికి బ్రోకర్‌లా పని చేస్తూ రాజ్యాంగ స్పూర్తికి విఘాతం కలిగిస్తున్నారని నారాయణ విమర్శించారు. తెలుగు రాష్ట్రాల సీఎంలకు గవర్నర్ భజన చేస్తున్నారని అన్నారు. అందుకే గణతంత్ర వేడుకల సందర్భంగా 'ఎట్ హోమ్' విందుకు ఆయన ఆహ్వానించినా తాను హాజరుకాబోనని ప్రకటించారు. గవర్నర్ వ్యవస్థ చెంచాగిరీకి తప్ప ఎందుకూ పనికి రాడని నారాయణ ఈ సందర్భంగా చెప్పడం గమనార్హం.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications