ఆ నేతలపై కిరోసిన్ పోసి అగ్గిపుల్ల గీయండి: రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు
ఒంగోలు: సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమను గెలిపిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామంటూ గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినవారిపై కిరోసిన్ పూసి అగ్గిపుల్ల గీసి అంటించండని ఆయన పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా కోసం ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన పాదయాత్ర మంగళవారం ప్రకాశం జిల్లా ఒంగోలు చేరుకుంది. సాయంత్రం అద్దంకి బస్టాండ్ సెంటర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో రాష్ట్రంలోని టిడిపి, కేంద్రంలోని బిజెపి నాటకాలు ఆడుతున్నాయని ఆయన విమర్సించారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ధైర్యం ఉంటే ప్రధానికి వాస్తవాలు చెప్పి ప్రత్యేక హోదా కోసం ఒప్పించానలని, లేదంటే చేతులు ముడుచుకుని కూర్చోవాలని ఆయన అన్నారు. రాష్ట్ర రాజధాని శంకుస్థాపనకు హాజరవుతున్న ప్రధాని ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించకుంటే మరుసటి రోజు అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తామని చెప్పారు.
నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు ఈ నెల 22వ తేదీన వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీని అఖిల పక్ష నేతలు కలిసేందుకు వెసులుబాటు కల్పించాలని సిపిఐ రాష్ట్ర కమిటి ముఖ్యమంత్రిని కోరింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ చంద్రబాబుకు ఓ లేఖ రాశారు.












Click it and Unblock the Notifications