జగన్ రాజీనామా-చంద్రబాబూ పద్దతి కాదు-నారాయణ షాకింగ్..!
ఏపీ రాజకీయాల్లో మాటల తూటాలు పేల్చే నాయకుడిగా పేరున్న సీపీఐ నారాయణ మరోసారి రెచ్చిపోయారు. సీఎం చంద్రబాబుతో పాటు వైసీపీ అధినేత జగన్ పైనా విరుచుకుపడ్డారు. ఇద్దరి విధానాలతో పాటు ప్రధాని మోడీ నిర్ణయాలను కూడా తప్పుబట్టారు. అలాగే చంద్రబాబు ప్రభుత్వం నెక్ట్స్ ఏం చేయాలో కూడా నారాయణ చెప్పేశారు. దీంతో నారాయణ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమవుతున్నాయి.
జగన్ ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలని సీపీఐ నారాయణ డిమాండ్ చేశారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలకు అందుబాటులో లేని జగన్ పదవిలో కొనసాగకూడదన్నారు. మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేయాలన్నారు. జగన్ చేష్టలు చాక్లెట్ కోసం చిన్నపిల్లలు కొట్టుకున్నట్లుందన్నారు. జనం ఘోరంగా ఓడిస్తే జగన్ ఎందుకు ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడని నారాయణ ప్రశ్నించారు.

గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వాళ్ళను వదిలేసి నోటి దురుసుతో మాట్లాడిన వాళ్ళను అరెస్ట్ చేయడం ఏమిటని నారాయణ చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజాధనాన్ని దోచేసిన వారందరూ ఇంకా బయట తిరుగుతున్నారన్నారని గుర్తుచేశారు. వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని ధ్వంసం చేసిన వారిని వదిలిపెట్టొద్దన్నారు. అందరినీ జైలుకు పంపాలని డిమాండ్ చేశారు.

మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నాడని నారాయణ తెలిపారు. దేశ ఆత్మగౌరవాన్ని ట్రంప్ కు మోడీ తాకట్టుపెట్టారన్నారు. మోడీ వ్యక్తిగత ఓట్లు తగ్గిపోయాయి,పార్టీ బలం తగ్గిపోయిందన్నారు.
ఆమ్ ఆద్మీ ఓటమికి మోడీ బ్లాక్ మెయిలింగ్ ప్రధాన కారణం అన్నారు. అలాగే ఆడవాళ్ళు సంతాన ఉత్పత్తి యంత్రాలు కాదని, చంద్రబాబు ఎక్కువ మంది బిడ్డల్ని కనమని చెప్పడం మంచి పద్ధతి కాదన్నారు. హిందీని బలవంతంగా రుద్దాలనుకోవడం మోడీ అహంకారానికి నిదర్శనమన్నారు.












Click it and Unblock the Notifications