నీకంటే ముందే మేం: కేసీఆర్‌పై నారాయణ భగ్గు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన సీపీఐ నేత నారాయణ శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు సీపీఐ వ్యతిరేకమనడం కేసీఆర్ దివాళాకోరుతనానికి, రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమన్నారు.
తెలంగాణకు అనుకూలంగా అందరికంటే ముందే నిర్ణయం తీసుకున్న జాతీయ పార్టీ సీపీఐ అన్నారు. తన దిష్టిబొమ్మలు కాదు, తననే తగలబెట్టినా తమ నిర్ణయం మార్చుకోబోమని ఆనాడే చెప్పామన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తెరాస కంటే ఉధృతంగా ఉద్యమించామన్నారు.

టీన్యూస్ రిపోర్టర్‌ను విధుల నుంచి తొలగించాలి: ఎర్రబెల్లి
జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వరంగల్ జిల్లా జనగామ వ్యాపారి కృష్ణమూర్తిని తెలుగుదేశం నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, మాగంటి గోపీనాథ్ తదితరులు పరామర్శించారు. వ్యాపారిని పది లక్షల రూపాయలు ఇవ్వాలంటూ బ్లాక్‌మెయిల్ చేసిన టీవీ రిపోర్టర్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కృష్ణమూర్తి వైద్య ఖర్చులను తెలుగుదేశం పార్టీ భరిస్తుందని చెప్పారు.












Click it and Unblock the Notifications