ముద్రగడ పాదయాత్రకు మద్దతు: నారాయణ
కాపు ఉద్యమ నేత ముద్రగడ పాదయాత్రకు తాము మద్దతిస్తున్నట్టు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రకటించారు.
ఏలూరు: కాపు ఉద్యమ నేత ముద్రగడ పాదయాత్రకు తాము మద్దతిస్తున్నట్టు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రకటించారు.
ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన హమీని అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాదు ముద్రగడ డిమాండ్‌లో సహేతుకత ఉందని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే పెట్రోల్ , డీజీల్‌లను కూడ జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఇసుక మాఫియాను అరికట్టడంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని చెప్పారు.
కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం చలో అమరావతి పాదయాత్రకు బయలుదేరితే పోలీసులు అడ్డుకొన్నారు. ఇవాళ్టితో గృహనిర్భంధం ముగిసింది. ఇంటివద్దనే పోలీసులు ముద్రగడను అడ్డుకొన్నారు. ముద్రగడ నివాసం వద్ద పోలీసులు మోహరించారు.












Click it and Unblock the Notifications