వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను లారీలతో గుద్దించి చంపేస్తారేమో..: సీపీఐ నారాయణ డౌట్

|
Google Oneindia TeluguNews

అమరావతి: సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ.. మరోసారి రాష్ట్ర ప్రభుత్వ పెద్దల వ్యవహార శైలిపై నిప్పులు చెరిగారు. తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కా ఫ్యాక్షనిస్టులా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఆయన ఫ్యాక్షనిస్టు ధోరణి ఎలా ఉంటుందనేది స్థానిక సంస్థల ఎన్నికల్లో చూశామని అన్నారు. ఫ్యాక్షనిస్టు నాయకుడు రాష్ట్రాన్ని ఏలుతున్నారని, ఆయన హయంలో శాంతిభద్రతలకు స్థానం లేదని విమర్శించారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు ప్రభుత్వ పెద్దల నుంచి ప్రాణాపాయం పొంచి ఉందని నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనను లారీలతో గుద్దించి చంపేస్తారేమోనని తనుక అనుమానంగా ఉందని చెప్పారు. వైఎస్ మూర్ఖపు చక్రవర్తిగా తయారయ్యారని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రమేష్‌కుమార్ తీసుకున్న నిర్ణయాలన్నీ సరైనవేనని స్పష్టం చేశారు. ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా గమనించారని, ముందుచూపుతో ఎన్నికలను వాయిదా వేశారని ప్రశంసించారు.
రమేష్‌కుమార్ ప్రాణానికి ప్రమాదం ఉన్నందున.. ఆయనకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

CPI National secretary Narayana alleged on YS Jagan Government

రమేష్‌కుమార్‌కు కులాన్ని ఆపాదించడం దారుణమని, కులం గురించి చేసిన వ్యాఖ్యలను వైఎస్ జగన్‌ వెనక్కి తీసుకోవాలని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా రమేష్‌కుమార్‌ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని నారాయణ వెల్లడించారు. రమేష్‌కుమార్‌‌తో చంద్రబాబు ఏనాడూ సఖ్యతగా వ్యవహరించలేదని, వారిద్దరి మధ్య సత్సంబంధాలు ఉండేవి కావని అన్నారు. ప్రభుత్వం మారినప్పటికీ.. ఆయన ఇబ్బందులు తొలగలేదని చెప్పారు.

ముఖ్యమంత్రి ఒక్కరే కాకుండా.. ఆయన మంత్రివర్గ సహచరులు కూడా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని నారాయణ ఆరోపించారు. యథారాజా..తథాప్రజా అన్నచందంగా ప్రభుత్వం పనితీరు తయారైందని మండిపడ్డారు. ప్రశ్నిస్తే.. దాడులు చేస్తామనే ధోరణి ప్రభుత్వ పెద్దలో నెలకొని ఉందని అన్నారు. సార్వత్రిక ఎన్నికలను ఏకగ్రీవంగా గెలుచుకోవడానికి ప్రభుత్వం ఎంతకైనా తెగించిందని, దాన్ని దృష్టిలో ఉంచుకునే రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేశారని అన్నారు. ఆరు వారాల తరువాతైనా ఎన్నికలు సజావుగా సాగుతాయనే నమ్మకం లేదని నారాయణ చెప్పారు.

English summary
CPI National Secretary Narayana alleged on YS Jagan Mohan Reddy Government in Andhra Pradesh that, State Election Commissioner Nimmagadda Ramesh Kumar is likely to attacked by the ruling YSR Congress Party leaders or supporters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X