25లోగా అమరావతి మాస్టర్ ప్లాన్ తెలుగులో ఇవ్వండి: బాబుకు అల్టిమేటం
విజయవాడ: నవ్యాంధ్ర రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్‌ను తెలుగులో ఇవ్వాలని లేదంటే అనుమానాలు పూర్తిగా నివృత్తి చేయాలని ఏపీ సిపిఎం రాజధాని ప్రాంత సమన్వయ కమిటీ కన్వీనర్ బాబూరావు గురువారం నాడు డిమాండ్ చేశారు.
మాస్టర్ ప్లాన్‌ను పరిశీలిస్తే వ్యవసాయ పరిరక్షణ జోన్ పేరిట ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నట్లుగా అర్థమవుతోందన్నారు. ఇది సింగపూర్ వారికి స్థిరాస్తి వ్యాపారం చేసుకునేందుకు అవకాశం కల్పించేదిలా ఉందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఈ నెల 25లోగా మాస్టర్ ప్లాన్‌ను తెలుగులో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదా అందులోని నిబంధనలు భూములు ఇచ్చిన వారికి మండలాల వారిగా అవగాహన సదస్సుల ద్వారా సందేహాలను నివృత్తి చేయాలన్నారు. మార్చిలో నిర్వహించనున్న శాసనసభ సమావేశాల్లో దీనిపై చర్చించాలన్నారు. లేదంటే సీఆర్డీఏ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
అంతర్వేదిలో మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపిందని రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యా రావు గురువారం తెలిపారు. హార్బర్‌కు కావలసిన అన్ని అనుమతులు, బెంగుళూరు నుంచి డిజైన్ రావడం, ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ నుంచి ఆదేశాలు జారీ చేయడంతో రూ.17 కోట్లతో రెండు రోజుల్లో టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు. ఈ టెండర్లకు 14 రోజుల కాల పరిమితి ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications