కిరణ్‌పై సిఆర్ సంచలన వ్యాఖ్యలు, జగన్‌పై బాలరాజు
కడప/విశాఖ: దేవాదాయ శాఖ మంత్రి సి రామచంద్రయ్య శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి, మైదుకూరు శాసన సభ్యుడు డిఎల్ రవీంద్రా రెడ్డితో పాటు తనను కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పదవి నుండి తొలగించాలని ప్రయత్నించారని ఆరోపించారు. డిఎల్‌తో పాటు తాను కూడా కిరణ్‌కు వ్యతిరేకమే అన్నారు.
కొత్త సంవత్సరం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం విఐపి పాసులను పాలకవర్గం పంచుకుంటోందని ధ్వజమెత్తారు. సామాన్యులకు శ్రీవారి దర్శనం లేకుండా చేస్తున్నారన్నారు. ఆయన కడప జిల్లాలో విలేకరులతో మాట్లాడారు.

టి బిల్లు అడ్డుకుంటాం: డిఎల్
తెలంగాణ బిల్లును అసెంబ్లీలో అడ్డుకుంటామని డిఎల్ రవీంద్రా రెడ్డి చెప్పారు. తాను పార్టీని ఎట్టి పరిస్థితుల్లోను వీడనని స్పష్టం చేశారు.
జగన్‌పై బాలరాజు ఫైర్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన మంత్రి పసుపు బాలరాజు విశాఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సభాపతి నాదెండ్ల మనోహర్ పైన జగన్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని, బాధాకరమన్నారు. రాజ్యాంగంపై గౌరవం లేకుండా అధికారం కోసం కలలు కనే వ్యక్తి జగన్ అని ఆరోపించారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిని అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు.
జగన్‌ను అసెంబ్లీకి పిలిపించి వివరణ కోరే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. పార్టీలు మారడం ఆర్థిక నేరాల కన్నా ప్రమాదకరమన్నారు. పార్టీలు మారాని భావిస్తున్న తన సహచరులను పిలిపించి తాను మాట్లాడుతానని చెప్పారు.












Click it and Unblock the Notifications