వైసీపీలోకి క్రికెటర్ అంబటి రాయుడు - పొలిటికల్ ఇన్నింగ్స్..!?
క్రికెటర్ అంబటి రాయుడు పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్దమయ్యారు. వైసీపీలోకి ఎంట్రీకి రాయుడు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి జగన్ పైన కొద్ది రోజులుగా ప్రశంసలు కురిపిస్తున్న అంబటి రాయుడు తాజాగా సీఎంను కలిసారు. ఐపీఎల్ లో సీఎస్కే ప్లేయర్ గా సక్సెస్ ఫుల్ గా ఆడుతున్న అంబటి రాయుడు ఈ టోర్నీ ముగిసిన తరువాత అధికారికంగా తన రాజకీయ ప్రయాణం పైన ప్రకటన చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు సమాచారం.
రాయుడు రాజకీయ ఎంట్రీ : ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయంగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ లో రాయుడు కీలక ఆటగాడిగా ఉన్నారు. ఈ నెల 28వ తేదీ వరకు ఐపీఎల్ కొనసాగనుంది. కొంత కాలంగా అంబటి రాయుడు పొలిటికల్ ఇన్నింగ్స్ గురించి ప్రచారం సాగుతోంది. తొలుత బీఆర్ఎస్ తో చేరుతారనే ప్రచారం జరిగింది. ఆ తరువాత రాయుడు ఏపీలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనే ఆసక్తితో ఉన్నట్లు తెలిసింది. కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి జగన్ ను ప్రశంసిస్తూ అంబటి రాయుడు సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెడుతున్నారు. సీఎం జగన్ ప్రసంగాన్ని తన ట్విట్టర్ ఖాతా లో షేరి చేసిన రాయుడు గ్రేట్ స్పీచ్ అంటూ ప్రశంసించారు.

సీఎం జగన్ పై ప్రశంసలు : రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరూ మీ మీద నమ్మకం..విశ్వాసంతో ఉన్నారంటూ ముఖ్యమంత్రిని ఉద్దేశించి పోస్టు చేసారు. దీంతో రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తితో ఉన్న రాయుడు ఐపీఎల్ పూర్తి అవ్వటంతోనే వైసీపీ ద్వారా పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభిచేందుకు సిద్దమయ్యారని ప్రచారం మొదలైంది. బీఆర్ఎస్ నేతలతో రాయుడుకు సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో తెలంగాణ నుంచి పోటీ చేస్తారనే ప్రచారానికి పరోక్షం గా తాను ఏపీ నుంచే పోటీ చేస్తానంటూ గతంలో రాయుడు సమాధానం ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. ఈ సమయంలో ఈ రోజున తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి అంబటి రాయుడు రావటం రాజకీయంగా మరింత ఆసక్తిని పెంచింది.
వైసీపీ నుంచి పోటీ చేస్తారా : గుంటూరు జిల్లా పొన్నూరు అంబటి రాయుడు స్వస్థలం. వచ్చే ఎన్నికల్లో రాయుడు రాజకీయంగా యాక్టివ్ రోల్ తీసుకోవాలనే లక్ష్యంతో ఉన్నారనేది స్పష్టం అవుతోంది. అయితే, ఇప్పుడు అంబటి రాయుడువచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రత్యక్షంగా పోటీ చేస్తారా.లేక ప్రచారానికి పరిమితం అవుతారా అనేది మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. ఈ మొత్తం వ్యవహారం పైన రాయుడు అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఎన్నికల కోసం పార్టీలో కీలక చేరికలు ప్రారంభమైన వేళ అంబటి రాయుడు వ్యవహారం మరింత ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications