Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వరలక్ష్మి హత్య కేసులో షాకింగ్ అంశాలు .. క్రైమ్ సినిమాల ప్రభావం.. క్రిమినల్ గా మారిన అఖిల్ !!

గాజువాక మైనర్ బాలిక , ప్రేమోన్మాది దాడిలో బలైపోయిన వరలక్ష్మి హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే . వరలక్ష్మి హత్య కేసులో ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. నిందితుడు అఖిల్ సాయి వెంకట్ వరలక్ష్మీ హత్య విషయంలో సినిమాలను చూసి ప్రేరణ పొందారని తేలింది. వరలక్ష్మి హత్యకు ముందు ఆమెను హత్య చేయడంతో పాటుగా, నేరం బయటకు రాకుండా ఉండడం కోసం అఖిల్ సాయి వెంకట్ చాలా పాపులర్ అయిన క్రిమినల్ సినిమాలను చూసినట్లుగా తెలుస్తుంది.

సినిమాల్లోలా నేరం నుండి తప్పించుకునే యత్నం చేసిన నిందితుడు అఖిల్

సినిమాల్లోలా నేరం నుండి తప్పించుకునే యత్నం చేసిన నిందితుడు అఖిల్

వరలక్ష్మిని హత్య చేసిన తర్వాత హత్య పై దృష్టిని మళ్ళించడం కోసం అక్కడ క్షుద్రపూజలు జరిగినట్లుగా సీన్ క్రియేట్ చేసినట్లుగా తెలుస్తుంది. చాలా సినిమాలలో నేరాలు చేసి, దృష్టి మళ్ళించడం కోసం రకరకాల ప్రయత్నాలు చేసి పోలీసుల దృష్టి మళ్లిస్తారు. ఈ క్రమంలోనే క్షుద్రపూజల సీన్ క్రియేట్ చేసినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా హత్య చేసిన తర్వాత నేరం బయటకు రాకుండా, నిందితుడిని డాగ్ స్క్వాడ్ పట్టుకోకుండా ఓ సినిమాలో మృత దేహం చుట్టూ కారం చల్లారు. ఇక ఆ సీన్ ని వరలక్ష్మి కేసులో కూడా అఖిల్ సాయి క్రియేట్ చేశారు.

 పోలీసుల విచారణలో సినిమాలు చూసి చేశానని చెప్పిన నిందితుడు

పోలీసుల విచారణలో సినిమాలు చూసి చేశానని చెప్పిన నిందితుడు

సినిమా లో చూసి పక్కా ప్లాన్ ప్రకారం ముందుగానే కారం కొనుగోలు చేసి, వరలక్ష్మి నిర్మానుష్య ప్రదేశానికి రప్పించి బ్లేడుతో గొంతుకోసి, ఎలాంటి ఆధారాలు లభించకుండా హతమార్చాలని భావించాడు. ఇక దృశ్యం సినిమా లోలా ఈ కేసు నుండి దొరక్కుండా తప్పించుకోవాలని ప్రయత్నం చేశాడు. ఈ విషయాలన్నింటిని నిందితుడు అఖిల్ సాయి వెంకట్ పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది.
గాజువాక లోని ఇంటర్ విద్యార్థిని వరలక్ష్మి విషయంలో ఏదైనా చేయాలన్న ఆలోచన వచ్చిన అఖిల్ సాయి వెంకట్ క్రైమ్ సినిమాలు చూసి ఆ సినిమాలతో ప్రభావితం అయ్యాడు. క్రైమ్ సినిమాలు చూసిన అఖిల్ సాయి చివరకు క్రిమినల్ గా మారాడు.

 సంఘటనా స్థలంలో సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు

సంఘటనా స్థలంలో సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు

అతి కిరాతకంగా ఇంటర్ విద్యార్థిని వరలక్ష్మిని బ్లేడుతో గొంతుకోసి హతమార్చాడు. పోలీసులు ఈ కేసుపై వేగవంతమైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈరోజు హత్య జరిగిన ప్రాంతంలో పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. చుట్టుపక్కల ఉన్న వారి నుండి సాక్ష్యాలను సేకరించారు. హత్యకు గురైంది మైనర్ కాబట్టి నిందితుడిపై హత్యానేరంతో పాటుగా, లైంగిక దాడికి పాల్పడిన అభియోగాన్ని కూడా మోపి త్వరలో ఛార్జిషీట్ దాఖలు చేస్తామని పోలీసులు చెబుతున్నారు.

 వరలక్ష్మి మైనర్ కావటంతో పోక్సో చట్టం క్రింద కేసు నమోదు

వరలక్ష్మి మైనర్ కావటంతో పోక్సో చట్టం క్రింద కేసు నమోదు

సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఏసీ ప్రేమ్ కాజల్ మాట్లాడుతూ నిందితుడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా అన్ని ఆధారాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు.ప్రస్తుతం వరలక్ష్మి హత్య నిందితుడు అఖిల్ విశాఖపట్నం సెంట్రల్ జైలు లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు . వరలక్ష్మి మరో యువకుడు రామ్‌తో చనువుగా ఉండటాన్ని భరించలేక అఖిల్ సాయి వెంకట్ ఈ హత్య చేసినట్లు నిర్ధారణ అయింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+