మే పెన్షన్ల పంపిణీ పై ప్రభుత్వం కీలక నిర్ణయం - నో ఛాన్స్..!!
ఏపీలో మరోసారి పెన్షన్ల పంపిణీ పై చర్చ మొదలైంది. ఏప్రిల్ నెలలో పెన్షన్ల పంపిణీ అంశం రాజకీయ దమారానికి కారణమైంది. వాలంటీర్లను పెన్షన్ల పంపిణీ నుంచి పక్కన పెట్టాలనే ఆదేశాలతో పెన్షన్ల పంపిణీ వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంది. ఈ నెల పెన్షన్లు ఇంటి వద్దే పంపిణీ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి మే నెల పెన్షన్ల పంపిణీ పైన ఎన్నికల సంఘానికి స్పష్టత ఇచ్చారు.
ఈసీకి సీఎస్ లేఖ
మే నెలలో పెన్షన్ల పంపిణీ పైన ప్రభుత్వం తేల్చేసింది. ఇంటింటికీ పింఛను పంపిణీ అవకాశాలపై ఇప్పటికే సెర్ప్ అధికారులతో, కలెక్టర్లతో సమీక్షించామని.. అది సాధ్యంకాదనే నిర్ణయానికి వచ్చామని తెలిపారు. మరోవైపు ఇదే అంశంపై పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్నికల ప్రత్యేక పరిశీలకుడికి లేఖ రాశారు. రాష్ట్రంలో 15,.004 గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.60 లక్షల మందికిగాను 1.26 లక్షల మంది మాత్రమే పనిచేస్తున్నారు.

అంటే... సగటున ఒక్కో సచివాలయంలో పని చేస్తున్నది 8 మందిమాత్రమే. ఇక... ఏఎన్‌ఎంలు/వార్డుహెల్త్ సెక్రటరీలు, అగ్రికల్చరల్ అసిస్టెంట్లకు జాబ్ చార్ట్ మేరకు వారి పనులు వారికి ఉంటాయి. 41 వేల మంది బీఎల్‌వో విధులతో చాలా బిజీగా ఉన్నారు. 55,900 మంది ఓపీఓ డ్యూటీల్లో ఉన్నారు. అందువల్ల ఇంటింటికీ వెళ్లి పింఛను ఇవ్వడం సాధ్యపడదని క్లారిటీ ఇచ్చారు.
ఏప్రిల్ నెలలో తరహాలో
గత నెలలోలాగా దివ్యాంగులు, నడవలేని వృద్ధులకు మాత్రమే ఇళ్లవద్ద పింఛను అందిస్తామని స్పష్టం చేశారు. ఏప్రిల్ నెలలో పెన్షన్ల పంపిణీ వివాదంతో ఈ నెల పెన్షన్ల పంపిణీ పైన టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల సంఘానికి లేఖ రాసారు. దీని పై ఎన్నికల కమిషన్, ఎన్నికల స్పెషల్ అబ్జర్వర్‌కు సీఎస్ జవహర్ రెడ్డి సమాధానంగా ఈ అంశాలను వెల్లడించారు.
ఇదే అంశం పైన స్పందించిన పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్పందించారు. ఈసారి 30వ తేదీ నాటికే పెన్షన్లకు అవసరమైన సొమ్ము సిద్ధంగా ఉంచుతామని, గరిష్ఠంగా 3వ తేదీలోపు పంపిణీ పూర్తి చేస్తామని సీఎస్ హామీ ఇచ్చారు.

ఈసీ నిర్ణయం ఏంటి
పింఛను పంపిణీకి దాదాపు 10వేల అదనపు కేంద్రాలను గుర్తించామని... వృద్ధులకు ఇబ్బంది లేకుండా నీడ కోసం టెంట్లు, నీళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. తీవ్రమైన ఎండల నేపథ్యంలో ఉదయం 7 నుంచే పంపిణీ మొదలుపెట్టి... రాత్రి 7 గంటల వరకు కొనసాగిస్తామని తెలిపారు. దీంతో..ఈ నెల పెన్షన్ల వ్యవహారం మరోసారి చర్చకు వస్తోంది. ఇప్పుడు సీఎస్ లేఖ పైన ప్రతిపక్ష పార్టీలు ఎలా స్పందిస్తాయనేది చూడాలి. ఎన్నికల సంఘం నిర్ణయం కీలకం కానుంది.












Click it and Unblock the Notifications