మాజీ సీఎం జగన్‌పై నమోదైన "కల్పబుల్‌ హోమీసైడ్‌" కేసు గురించి తెలుసా..!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. ఆయన జూన్ 18న సత్తెనపల్లిలోని ఓ వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు. ఆ క్రమంలోనే జగన్
ప్రయాణిస్తున్న కాన్వాయ్ వాహనం కింద పడి చీలి సింగయ్య అనే వ్యక్తి చనిపోయారు. ఈ సంఘటన రెంటపాళ్ల వద్ద చోటు చేసుకోగా మృతుని భార్య లూర్ధు మేరీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అయితే మొదట సింగయ్య చనిపోయిన విషయంలో జగన్ కాన్వాయ్‌‌కు సంబంధం లేదని జిల్లా పోలీసులు ప్రకటించారు. ఓ ప్రైవేట్ వాహనం ఢీ కొట్టడం వల్లే సింగయ్య మరణించారని పోలీసులు ధృవీకరించారు. కానీ లేటెస్ట్ గా ప్రమాదానికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోల ఆధారంగా, జగన్ ప్రయాణిస్తున్న కారు కింద పడే సింగయ్య మరణించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వీడియోలు వెలుగులోకి రావడంతో ఈ కేసులో కీలక మలుపులు చోటు చేసుకున్నాయి.

culpable-homicide-case-registered-against-former-cm-jagan

ఈ నేపథ్యంలో ఎఫ్ఐఆర్ లో మార్పులు చేసిన గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు.. జగన్ కారు డ్రైవర్ రమణారెడ్డిని ఈ ఘటనకు బాధ్యుడిని చేస్తూ ఏ1గా కేసు పెట్టారు. అలాగే జగన్ ను ఏ2గా చేర్చారు. వ్యక్తిగత కార్యదర్శి కె. నాగేశ్వరరెడ్డిని A3, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని A4, మాజీ మంత్రి పేర్ని నానిని A5, మాజీ మంత్రి విడదల రజినిని A6గా చేర్చారు. గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.

అంతే కాకుండా తాడేపల్లిలోని నివాసం నుంచి సత్తెనపల్లి పర్యటనకు జగన్ బయలుదేరిన సమయంలో.. కాన్వాయ్‌కు కేవలం మూడు కార్లకు మాత్రమే అనుమతి ఇచ్చినప్పటికీ అనుమతులకు విరుద్ధంగా వాహనాలు ప్రయాణించాయని ఎస్పీ తెలిపారు. వీరిపై బీఎన్‌ఎస్‌లోని 105, 49 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు వివరించారు. దాంతో ఈ సెక్షన్ 105 గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తోంది.

అసలు ఏంటీ "కల్పబుల్ హోమీసైడ్" కేసు..?

బీఎన్‌ఎస్‌ 105 సెక్షన్ ని హత్య కిందకు రాని కల్పబుల్ హోమీసైడ్ అని చర్యలకు ఉపయోగిస్తారు. ఒక వ్యక్తి మరణానికి కారణమైనప్పుడు ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. నేరం నిరూపణ అయితే సంబంధిత వ్యక్తులకు జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది. అంతే కాకుండా నేర తీవ్రతను బట్టి 5 నుంచి 10 ఏళ్లు వరకు జైలు శిక్ష, జరిమానా కూడా విధించవచ్చని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్ గా వివరిస్తున్నారు.

దీంతో పాటు వైసీపీ నేతలపై నేరానికి ప్రేరేపించారనే అభియోగంపై బీఎన్‌ఎస్‌ 49 సెక్షన్ కూడా చేర్చారు. ఈ సెక్షన్ ప్రకారం.. నేరానికి ప్రేరణ ఇవ్వడం, ప్రోత్సహించడం లేదా సూచించడం వంటి వాటిపై కూడా చర్యలు తీసుకోవచ్చు. కేసులోని వీడియో ఆధారాలన్నింటినీ పరిశీలించిన తర్వాతనే ఈ సెక్షన్ ను చేర్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వ్యవహారం ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన తరుణంలో పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. రానున్న రోజుల్లో ఏం జరగనుందో అని హాట్ డిస్కషన్ నడుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+