అమరావతి వేదికగా సీడబ్ల్యూసీ సమావేశం: ఏపికి ప్రియాంక :ఢిల్లీలో టిడిపితో పొత్తు..!
ఏపిలో భారీగా నష్టపోయిన కాంగ్రెస్ తిరిగి ఎన్నికల వేళ పుంజుకొనేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రత్యేక హోదా అస్త్రంగా ఎన్నికల బరిలోకి దిగుతోంది. ఏపి ప్రజలను ఆకట్టుకొనేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం విజయవాడలో ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు. ఇక, ప్రియాంకను ఏపిక ఆహ్వానిస్తున్నారు.
విజయవాడలో సీడబ్ల్యూసీ సమావేశం..
ఏపిలోని పార్టీ పరిస్థితులు..ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల పై ఏపి నేతలతో కాంగ్రెస్ అధినేత రాహుల్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసారు. అందులో రాష్ట్ర నేతలు పలు విజ్ఞప్తులు రాహుల్ ముందుంచారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవాడలో నిర్వహించాలని ఏపీ నేతలు అభ్యర్థించారు. రాష్ట్రం లో తాము చేపట్టే ప్రత్యేక హోదా భరోసా ప్రజా యాత్రలో పాల్గొనాలని, ప్రియాంకగాంధీతో అగ్రనేతలందరినీ పంపిం చాలని కోరారు. ఇందుకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ చా ర్జి ఊమెన్ చాందీ, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎంపీలు టి.సుబ్బిరామిరెడ్డి, కేవీ పీ రామచంద్రరావు రాహుల్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యకలాపాలు, ఎ న్నికల సన్నద్ధతపై ఆయన ఆరా తీశారు. ప్రత్యేక హోదా భరోసా యాత్ర 13 జిల్లాల్లోని 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో సాగుతుందని ..ఈ యాత్రలో ఒక రోజు రాహుల్, మరొక రోజు ప్రియాంక రావాలని ఆహ్వానించా మని రఘువీరా చెప్పారు.

ఢిల్లీ స్థాయిలోనే టిడిపితో పొత్తు..
ఏపిలో టిడిపి తో పొత్తు ఉండదని ఇప్పటికే స్పష్టం చేసిన కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ కు జాతీయ స్థాయిలో ఒక విధానం .. ఆయా రాష్ట్రాల పరిస్థితులను బట్టి స్థానిక విధానాలు ఉంటాయని, ఆంధ్రలో బీజేపీ, టీడీపీ, వైసీపీలకు సమాన దూ రం పాటిస్తామని చెబుతున్నారు. అధికారంలోకి వచ్చాక ప్రత్యేకహోదా ఫైలుపైనే తొలిసంతకం చేస్తానని కర్నూలు సభలో రాహుల్..తెలంగాణ ఎన్నికల ప్రచార సభలో సోనియా ఇప్పటికే స్పష్టం చేసారు. ఇక, అసెంబ్లీ, లోక్‌సభ నియో జకవర్గాలకు పార్టీ అభ్యర్థులను ఈ నెలాఖరులోగా ఖరారు చేస్తామని పిసిసి చీఫ్‌రఘువీరా చెప్పారు. పోటీ చేయాలను కునే వారు ఈ నెల 7 నుంచి 10వ తేదీ వరకు అన్ని జిల్లాల కాంగ్రెస్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని, వాటిని పీసీసీ పరిశీలించి అధిష్ఠానానికి జాబితా పంపుతామని స్పష్టం చేసారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications