కిరణ్ కూడా మినహాయింపు కాదు: టికి డిగ్గీ కంగ్రాట్స్

Digvijay Singh
న్యూఢిల్లీ: తెలంగాణపై నిర్ణయం పూర్తయిందని, దానిపై వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదని, సిడబ్ల్యూసి నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా అందుకు మినహాయింపు కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ సోమవారం అన్నారు. సోమవారం రాత్రి తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

అదే సమయంలో హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలన్న ప్రతిపాదనను కూడా మంత్రుల బృందం పరిశీలిస్తుందని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

జివోఎం ప్రక్రియ పూర్తయిందని, ఈ నెలాఖరునాటికి ముసాయిదా బిల్లు తయారు అవుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫైనల్ అని సీమాంధ్ర కేంద్ర మంత్రులు అర్థం చేసుకోవడం మంచి పరిణామమన్నారు. సీమాంధ్ర ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి, ఆ రాష్ట్రానికి మంచి ఆర్థిక ప్యాకేజీని ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ నెలాఖరుకల్లా ప్రక్రియ పూర్తి: మొయిలీ

రాష్ట్ర విభజన విధివిధానాల ఖరారుపై ఏర్పాటైన మంత్రుల బృందం ఈ నెలాఖరుకల్లా ప్రక్రియ పూర్తి చేస్తుందని జివోఎం సభ్యుడు వీరప్ప మొయిలీ తెలిపారు. సోమవారం జివోఎం భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. "జివోఎం చర్చల కసరత్తు పూర్తయింది. 21వ తేదీన తిరిగి సమావేశమై ముసాయిదా నివేదికను ఖరారు చేస్తాం'' అని తెలిపారు. ముఖ్యమంత్రి తన అభిప్రాయాలను స్పష్టంగా వివరించారన్నారు. తమ ముందుకు వచ్చిన అన్ని పార్టీ నేతలతో చర్చించామని, అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని మొయిలీ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+