ముంచుకొస్తున్న ఆక్వాన్ తుఫాను, ఆర్నాబ్ ను మించి- ఈ జిల్లాలపై తీవ్ర ప్రభావం..!!
ఏపీకి మరో తుఫాను ముంచుచొస్తోంది. ఏపీకి ఆక్వాన్ తుఫాను ముప్పు పొంచి ఉంది. ఆర్నాబ్ తుఫాను తరహాలో విరుచుకు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరో 48 గంటల్లో వాయుగుండంగా మారనుంది. ఈ నెల 16వ తేదీ సాయంత్రానికి బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ప్రభావం తో 150 కిమీ వేగంతో గాలులు వీస్తాయని.. 19 లేదా 20న తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి తుఫాన్ ముప్పు పొంచి ఉంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ పెను తుఫానుగా మారేందుకు సిద్ధమవుతోంది. 17వ తేదీ నుంచి ఏపీపై దీని ప్రభావం స్పష్టంగా కనిపించనుంది. ఉత్తర తమిళనాడు - కోస్తాంధ్ర తీరాల వైపు దూసుకొస్తూ, ఈ నెల 19వ తేదీ సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, కొస్తాంధ్ర రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. మరకొన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణ ఏర్పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

వాతావరణ శాఖ తాజా అంచనాలు
కాగా, ఈ నెల 18, 19 తేదీల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం నుంచి సముద్రం అత్యంత అలజడిగా మారనుండటంతో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్ళరాదని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు తక్షణమే సురక్షితంగా తీరానికి తిరిగి రావాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక చేసింది. మరోవైపు, తెలంగాణలో పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ, సాయంత్రం వేళల్లో చలి తీవ్రత పెరుగుతోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల వరకు పడిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. రానున్న మూడు రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.













Click it and Unblock the Notifications
