తుఫాను ముప్పు తప్పినా.. తీరం దాటేది అక్కడే- ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. తాజా అలర్ట్స్..!!

ఏపీకి ఆక్వాన్ తుఫాను ముప్పు తప్పింది. దిశ మార్చుకొని ఒడిశా వైపు పయనిస్తోంది. తొలుత ఈ తుఫాను మచిలీపట్నం- చెన్నై, తరువాత కాకినాడ-విశాఖ మధ్య తీరం దాటుతుందని అంచనా వేసారు. అయితే, రాష్ట్రానికి సమీపంగా వచ్చినా దిశ మారటంతో ఒడిశా వైపు వెళ్తోంది. శుక్రవారం మధ్యాహ్నం నరసాపురం-పూరీ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.

తీవ్ర తుఫాన్‌ 'అక్వాన్‌' దిశ మార్చుకుంది. కాకినాడ వైపు కాకుండా ఒడిశా దిశగా పయనిస్తోంది. ఇది ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం గోపాలపూర్‌ పరిసరాలు, ఒడిశాలోని కొన్ని ప్రాంతాలు, ఇంకా దానికి ఆనుకుని ఉన్న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, బారువపై ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం దాటే సమయం తీవ్ర వాయుగుండంగా/వాయుగుండంగా బలహీనపడుతుందని, దీంతో గాలుల వేగం 60 నుంచి 70 కి.మీ., అప్పుడప్పుడు 80 కి.మీ.కు పరిమితం కానుందని తెలిపారు. అక్వాన్‌ నరసాపురానికి ఆగ్నేయంగా 480 కి.మీ., కళింగపట్నానికి దక్షి ణ ఆగ్నేయంగా 520 కి.మీ., గోపాలపూర్‌కు దక్షిణంగా 510 కి.మీ. దూరంలో ఉంది. అక్వాన్‌ దిశ మార్చుకోవడంతో కోస్తాంధ్రలో ము ఖ్యంగా మధ్య కోస్తాకు ముప్పు తప్పింది.

 అలిపిరి నడకమార్గంలో కేబుల్ బ్రిడ్జి - వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం, టోకెన్లు జారీ ఇలా..!!
అలిపిరి నడకమార్గంలో కేబుల్ బ్రిడ్జి - వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం, టోకెన్లు జారీ ఇలా..!!
cyclone-aqwan-andhra-pradesh-escapes-direct-threat-heavy-rains-forecast-in-north-andhra

వాతావరణ శాఖ తాజా అలర్ట్స్

కాగా, ఉత్తరాంధ్ర, యానాం, దక్షిణ ఒడిశా తీరాలకు రెడ్‌ అలెర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం నుం చి కాకినాడ వరకు గురు, శుక్రవారాలు అక్కడక్కడ కుంభవృష్టి, అనేకచోట్ల ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఉభయ గోదావరి, ఏలూరు, కోనసీమ, కృష్ణా, బాపట్ల, గుం టూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉత్తరాంధ్ర తీరం వెంబడి రేపు (గురువారం) గంటకు 60 కిలోమీటర్ల నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఒడిశా లో తుఫాను ప్రభావంతో ముందస్తుగా పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. తాజా అలర్ట్స్ తో శ్రీకాకుళం జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. ఈ క్రమంలోనే అత్యవసర సహాయక చర్యలకు 13 ఎన్డీఆర్​ఎఫ్​, 11 ఎస్డీఆర్​ఎఫ్​ బృందాలు, అగ్నిమాపక బృందాలను సిద్ధం చేశారు. రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+