Video: తుఫాను మిగిల్చిన ఘోర విషాదం.. అర్నాబ్ దెబ్బకి ఐదుగురు బలి!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 'అర్నాబ్' తుఫాను తీవ్రంగా కుదిపేసింది. నరసాపురం దగ్గర తీరం దాటిన ఈ తుఫాను ధాటికి తీర ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఈదురుగాలులు, కుంభవృష్టి వర్షాల కారణంగా రాష్ట్రంలో జరిగిన వివిధ ప్రమాదాల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రభుత్వం ముందస్తుగా ఎంతగా అప్రమత్తమైనప్పటికీ, ప్రకృతి సృష్టించిన ఈ విలవానికి పలువురు బలయ్యారు.

అర్నాబ్ తుఫాను తీరాన్ని దాటే సమయంలో గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. కొన్ని ప్రాంతాల్లో గాలి వేగం గంటకు 150 కిలోమీటర్ల వరకు దూసుకెళ్లింది. యానాం, బాపట్ల, విశాఖ తీర ప్రాంతాలను వణికిస్తూ అర్నాబ్ మునుపటి కంటే బలహీనపడి తీవ్ర తుఫానుగా, ఆ తర్వాత క్రమంగా వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అయినప్పటికీ దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Cyclone Arnab Landfall Causes Five Deaths In Andhra Pradesh As Heavy Rain And Strong Winds Cause Destruction

వివిధ ఘటనల్లో ఐదుగురు మృతి..

తుఫాను సృష్టించిన ప్రాణ నష్టం తీవ్ర దిగ్భ్రాంతికరంగా ఉంది. భీమవరంలో భారీ చెట్టు విరిగిపడి కిషోర్ (48) అనే వ్యక్తి మృతి చెందగా, విశాఖలో నీటిలో తెగిపడిన విద్యుత్ తీగల ద్వారా షాక్ తగిలి దేవుడు (65) ప్రాణాలు కోల్పోయారు. అలాగే బాలాజీనగర్‌లో కూలిన విద్యుత్ స్తంభం కింద పడి మాధవి అనే మహిళ మృతి చెందగా, అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో కరెంట్ షాక్ తగిలి భాగ్యలక్ష్మి (55) ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు కోనసీమ పరిధిలోని సఖినేటిపల్లిలో ఈదురుగాలుల వర్షానికి గుడిసె కూలిపోయి వెంకాయమ్మ దుర్మరణం చెందారు.

Cyclone Arnab: కేంద్రానికి సాయం కోరిన సీఎం.. అమిత్ షాకు చంద్రబాబు అత్యవసర లేఖ
Cyclone Arnab: కేంద్రానికి సాయం కోరిన సీఎం.. అమిత్ షాకు చంద్రబాబు అత్యవసర లేఖ

రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బలగాలు..

పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నాలుగు అదనపు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను వైమానిక దళ విమానాల ద్వారా ఏపీకి రప్పించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థలకు చెందిన భారీ బలగాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. యానాం ప్రాంతంలో వర్షాల వల్ల నీటిలో చిక్కుకున్న ప్రజలను రక్షించడంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 57 వేల మందికి పైగా నిరాశ్రయులను సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించి భోజన వసతి కల్పించారు.

అర్నబ్ తుఫాన్ ఉగ్రరూపం.. 32 వేల మంది అధికారులతో సీఎం అత్యవసర రివ్యూ
అర్నబ్ తుఫాన్ ఉగ్రరూపం.. 32 వేల మంది అధికారులతో సీఎం అత్యవసర రివ్యూ

తీవ్రంగా దెబ్బతిన్న మౌలిక వసతులు.. యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ!

ఉప్పాడ తీర ప్రాంత రోడ్డు తీవ్రమైన సముద్ర అలల తాకిడికి కొట్టుకుపోయింది. కాకినాడ పరిసర ప్రాంతాల్లో తీర కోత ఆందోళన కలిగిస్తోంది. వందలాది చెట్లు కూలిపోవడం, విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో పలు జిల్లాల్లో అంధకారం అలుముకుంది. ముఖ్యమంత్రి కార్యాలయం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ, విద్యుత్ సరఫరాను, రాకపోకలను పునరుద్ధరించేందుకు యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో అప్రమత్తం చేసింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+