ఏపీని ఆర్ణబ్ తుఫాన్: నిలకడగా- ల్యాండ్ ఫాల్ ఇంకా కంటిన్యూ
ఊహించినట్టే.. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆర్ణబ్ తుఫాన్ విధ్వంసాన్ని సృష్టించింది. ఈ వేకువ జామున 2:30 నుంచి 3 గంటల సమయంలో నరసాపురం- యానాం సమీపంలో తీరాన్ని తాకిన తుఫాన్ తీవ్రత అంచనాలకు మించిన స్థాయిలో కనిపించింది. ఉత్తరాంధ్ర, కోస్తా తీరం మొత్తం అల్లకల్లోలమైంది. భారీగా కోతకు గురైంది. అనేక చోట్ల సముద్రం కొన్ని మీటర్ల పాటు ముందుకు చొచ్చుకొచ్చింది. కోస్తా జిల్లాలకు కంటి మీద కునుకులేకుండా చేసింది.
ఈ తుఫాన్ తీరాన్ని దాటే సమయంలో 125 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచాయి. తీరంలో అలలు 1.5 నుంచి 2.5 మీటర్ల ఎత్తువరకు ఎగిసిపడ్డాయి. ల్యాండ్ ఫాల్ ప్రక్రియ మూడు గంటల పాటు కొనసాగుతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తుఫాన్.. తీరానికి సమీపించిన సమయంలో దాని వేగం మందగించింది. గంటకు మూడు కిలోమీటర్ల వేగంతో కదిలింది. కేటగిరి 3 గా గుర్తించింది ఐఎండీ. తీరాన్ని తాకిన తర్వాతా భారీ వర్షాలు, ఈదురుగాలుల ప్రభావం కొనసాగుతుందనీ పేర్కొంది.

దీని ధాటికి కాకినాడ జిల్లా చివురుటాకులా వణికిపోయింది. జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడ్డాయి. కొన్ని చోట్ల భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి. కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గంటకు 125-135కిమీ వేగంతో ఈదురుగాలులు నమోదైనట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఈదురుగాలుల తీవ్రత అధికంగా కనిపించింది. ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. ఉక్కిరిబిక్కిరికి గురి చేశాయి. అనేక ప్రాంతాల్లో అంధకారం ఏర్పడింది.
తుఫాన్ తీవ్రత అంచనాలకు మించి ఉండటంతో ఇవే పరిస్థితులు మధ్యాహ్నం వరకూ కొనసాగే అవకాశం ఉంది. తుఫాన్ తీరం దాటే ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే వస్తోంది. రెండు గంటలుగా నిలకడగా ఉంటోంది. ఈ ఉదయం 8 గంటల సమయానికి నరసాపురానికి 30 కిలో మీటర్ల దూరంలోనే ఇది కేంద్రీకృతమై ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. తుఫాన్ తీరాన్ని తాకిన మూడుగంటల్లోగా ల్యాండ్ ఫాల్ ప్రక్రియ పూర్తవుతుందని మొదట్లో భావించినా అది సాధ్యపడట్లేదు.
ఈ ప్రక్రియ మధ్యాహ్ననికి పూర్తి అవుతుందని విపత్తుల సంస్థ అంచనా వేసింది. ఆ తర్వాతే తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. ఫలితంగా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు కొనసాగుతున్నాయి. తీర ప్రాంత జిల్లాల్లో వర్షాలు పడుతూనే వస్తోన్నాయి. ఈ రోజంతా కూడా వర్షాల తీవ్రత ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
#WATCH | Visakhapatnam, Andhra Pradesh: Strong winds and high tides are being witnessed at RK Beach under the influence of Cyclone Arnab, with rough sea conditions prevailing in the area. Police have restricted public entry onto the beach as a precautionary measure, while fishermen have been advised not to venture into the sea.
— ANI (@ANI) October 28, 2026












Click it and Unblock the Notifications
